నేతలను వెంటాడుతున్న 'మీడియా'.. బ్రిటన్ సంస్కృతి ఏపీలోనా?
ఇక, జగన్ వ్యవహారాన్ని ఒక వర్గం మీడియా ఇంత నిశితంగా గమనిస్తే.. మరో వర్గం మీడియా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై కన్నేసింది.
By: Tupaki Desk | 21 May 2024 12:30 PM GMTనేతలు చెప్పింది రాసుకుని.. వారు చెప్పింది.. ప్రసారం చేసే బాధ్యత వరకే పరిమితం కావాల్సిన మీడి యా.. వెంటాడే పరిస్థితి వచ్చిందా? ఒకప్పుడు .. నేతల నిర్ణయాలను మాత్రమే విశ్లేషించేవారు.. కానీ.. ఇప్పుడు వ్యక్తిగత అంశాలను.. కుటుంబ వ్యవహారాలను కూడా.. మీడియా వాచ్ చేస్తోంది. ఇది నిజానికి భారత మీడియా సంస్కృతి కాదు. ఒకప్పుడు ఇందిరా గాంధీ వ్యవహారంపై ఇలానే వ్యక్తిగత విషయాలు చర్చకు వచ్చాయి. ఆమె ఏం తింటున్నారు? ఎలా నిద్ర పోతున్నారు.. ? వంటి అనేక అంశాలు వచ్చాయి.
కానీ, వాటిని ఏ మీడియా కూడా బయట పెట్టలేదు. దీనికి కారణం.. నేతలతో ఎంత వరకు ఉండాలో అంతే ఉండాలన్న కొన్ని స్వీయ నిబంధనలు.. చట్టాలు బిగించుకోబట్టే. కానీ, బ్రిటన్ వంటి దేశాల్లో.. మీడియా వ్యక్తిగత విషయాలను కూడా టార్గెట్ చేస్తుంది. నేతలను వెంటాడుతుంది. దీనికి ఫలితమే ప్రిన్సెస్ డయా నా మరణ ఉదంతం. ఈ ఘటన తర్వాత.. బ్రిటన్ మీడియాపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత.. కొన్ని ఆంక్షలు కూడా విధించారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలోనూ మీడియా పనిగట్టుకుని నేతలను వెంటాడుతోంది.
సీఎం జగన్ తన కుటుంబంతో పాటు.. బ్రిటన్ సహా వేరే దేశాలకు వేకేషన్‌కు వెళ్లారు. ఇంత వరకు వార్త లు వచ్చాయి. బాగానే ఉంది. కానీ, ఆయన అక్కడ ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? ఎలా ఉంటు న్నారు. ఏయే గదుల్లో ఉంటున్నారు. వాటి అద్దెలు.. వాటి నిదులు ఎక్కడ నుంచి వస్తున్నాయనే విషయా లపై ఏపీలో మీడియా కన్నేసింది. గూగుల్ సాయంతో ఆయా వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసి.. రాష్ట్ర ప్రబుత్వం కూడా అలెర్ట్ అయింది. గూగుల్ ను సంప్రదించి.. ఆయా వివరాలువెల్లడి కాకుండా చూడాలని కోరినట్టు తాజా సమాచారం.
ఇక, జగన్ వ్యవహారాన్ని ఒక వర్గం మీడియా ఇంత నిశితంగా గమనిస్తే.. మరో వర్గం మీడియా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై కన్నేసింది. ఆయన కూడా.. తన కుటుంబంతో కలిసి.. విదేశాలకు వెళ్లారు.
అయితే.. వెళ్లేముందు.. తన అనారోగ్య సమస్యలపై అమెరికాలో పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. ఇంతటితో సరి! కానీ.. ఓ వర్గం మీడియా ఆయనను కూడా వెంటాడుతోంది. ఆయన అమెరికా వెళ్లలేదని.. ఇటలీ వెళ్లారని.. నారా లోకేష్ కుటుంబం కూడా.. వెళ్లిందని.. ఇలా.. కొన్ని కథనాలను ప్రచారం చేస్తూ.. నేతలను వెంటాడుతుండడంపై సర్వత్రా ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. నేతలు ఎవరైనా.. వారికి కూడా... పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారి స్వేచ్ఛను కూడా హరించేలా ఇలా మీడియా వెంటాడే పరిస్థితి రావడం చూస్తే.. ఒకప్పటి బ్రిటన్ సంస్కృతి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.