Begin typing your search above and press return to search.

పవన్ కు పంచాయతీ రాజ్... ఏపీలో మంత్రుల శాఖలివే!

అవును... ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న చంద్రబాబు.. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 9:26 AM GMT
పవన్  కు పంచాయతీ రాజ్... ఏపీలో మంత్రుల శాఖలివే!
X

ఏపీలో బుధవారం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో సహా మరో 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ క్రమంలో గురువారం సీఎంగా బాధ్యతలు తీసుకున్న బాబు.. శుక్రవారం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ సందర్భంగా పవన్, అనిత, అచ్చెన్న, లోకేష్ లకు కీలక శాఖలు కేటాయించారు!

అవును... ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న చంద్రబాబు.. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ కు కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖలు కేటాయించగా... లోకేష్ కు హెచ్.ఆర్.డీ., ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. అనితకు హోంశాఖ ఇచ్చారు!

ఈ సందర్భంగా మంత్రులు - వారికి కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి...!

చంద్రబాబు: సీఎం, లా & ఆర్డర్, పబ్లిక్ ఎంట్రర్ ప్రైజెస్, జీఏడీ

పవన్ కల్యాణ్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ & టెక్నాలజీ

నారా లోకేష్: మానవ వనరుల అభివృద్ధి, ఐటీ కమ్యునికేషన్స్

అచ్చెన్నాయుడు: వ్యవసాయం, మార్కెటింగ్, సహకారశాఖ, పశుసంవర్థక శాఖ, డెయిరీ, మత్స్యశాఖ

వంగలపూడి అనిత: హోంశాఖ, విపత్తు నిర్వహణ

పయ్యావుల కేశవ్: ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసన సభ వ్యవహారాలు

పి నారాయణ: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్

కొల్లు రవీంద్ర: గనులు, ఎక్సైజ్

నాదేండ్ల మనోహర్: పౌరసరఫరాలశాఖ

నిమ్మల రామానాయుడు: జలవనరుల అభివృద్ధి

సత్యకుమార్: ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మెడికల్ ఎడ్యుకేషన్

ఆనం రామనారాయణరెడ్డి: దేవాదాయ శాఖ

ఎండీ ఫరూక్: లా, మైనారిటీ సంక్షేమం

కొలుసు పార్థసారథి: గృహనిర్మాణం, సమాచార శాఖ

అనగాని సత్యప్రసాద్: రెవిన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్

డోల బాల వీరాంజనేయస్వామి: సోషల్ వెల్ఫేర్, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ

గొట్టిపాటి రవికుమార్: విద్యుత్ శాఖ

బీసీ జనార్ధన్ రెడ్డి: ఆర్ & బీ, మౌలిక వసతులు

కందుల దురేష్: టూరిజం, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ

గుమ్మడి సంధ్యారాణి: గిరిజన, మహిళా శిశు సంక్షేమం

టీజీ భరత్: పరిశ్రమలు, వాణిజ్యం

ఎస్ సవిత: బీసీ సంక్షేమం, చేనేత, జైళి

వాసంశెట్టి సుభాష్: కార్మిక శాఖ

కొండపల్లి శ్రీనివాస్: చిన్నతరహా పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాలు

మందిపల్లి రాం ప్రసాద్ రెడ్డి: రవాణా, యువజన, క్రీడాలు