ఆ నలుగురు ఒకే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు!
ఏపీకి చెందిన ఎందరో వ్యక్తులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో స్థిరపడ్డారు. ఇక, పొరుగు దేశాల్లోనూ స్తిరపడిన వారు కూడా ఉన్నారు.
By: Tupaki Desk | 6 Jun 2024 12:30 AM GMTఏపీలో చిత్రమైన విషయం ఒకటి వెలుగు చూసింది. తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న నలుగురు ఎమ్మెల్యేలకు ఒక ప్రాంతంతో అనుబంధం ఉన్న విషయం వెలుగు చూసింది. నిజానికి ప్రతి ఒక్కరూ ఒక ప్రాంతంలో జన్మిస్తారు. అక్కడే ఉపాధి దొరికితే ఓకే.. లేకపోతే.. పోరుగు ప్రాంతాలకు లేదా.. పొరుగు జిల్లాలకు.. లేదా పొరుగు రాష్ట్రాలకు కూడా వెళ్లి జీవిస్తారు. అక్కడే స్థిరపడతారు. ఇది కామన్. ఏపీకి చెందిన ఎందరో వ్యక్తులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో స్థిరపడ్డారు. ఇక, పొరుగు దేశాల్లోనూ స్తిరపడిన వారు కూడా ఉన్నారు.
విద్య కోసం.. విదేశా్ల్లో స్థిరపడిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలానే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంతో అనుబంధం ఉన్న నలుగురు నాయకులు తాజాగా జరిగిన ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నారు. వీరికి కొండపి ఎస్సీ నియోజకవర్గంతో గత అనుబంధం ఎంతో ఉందని తెలుస్తోంది. విశాఖ జిల్లా భీమిలి నుంచి విజయం దక్కించుకున్న గంటా శ్రీనివాసరావుకు కూడా కొండపితో అనుబంధం ఉందని తెలిసింది. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారని.. వారి కుటుంబం చాన్నాళ్లు ఇక్కడే ఉందని తెలిసింది.
ఇక, పిఠాపురం నుంచి విజయం దక్కించుకున్న పవన్ కూడా.. తనకు నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో అనుబంధం ఉందని చెప్పుకొన్న విషయం తెలిసిందే. అలానే .. ఒంగోలు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న దామచర్ల జనార్ధన్.. తాత, తండ్రి కూడా.. రాజకీయంగా కొండపికి చెందిన వారే. కొండపి ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వ్‌డ్ కాకముందు.. దామచర్ల తాత ఇక్కడ ప్రజాప్రతినిధిగా పనిచేశారు. అలానే చీరాల నుంచి విజయం దక్కించుకున్న ఎం.ఎం. కొండయ్య యాదవ్ కూడా.. కొండపిలో జన్మించిన వారే. ఇక్కడే ఆయన కుటుంబం చానాళ్లు ఉంది.
అలానే.. కొండపి నుంచి వరుసగా రెండోసారి విజయం దక్కించుకున్న డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి స్వస్థలం ఇదే. గతంలో ఆయన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఫిజీషియన్‌గా పనిచేశారు. తర్వాత.. టీడీపీలో చేరారు. వరుసగా విజయాలు అందుకున్నారు. ఇలా.. ఈ నలుగురు కూడా.. కొండపితో అనుబంధం పెంచుకున్నారే కావడం గమనార్హం.