Begin typing your search above and press return to search.

24 నుంచి ఏపీ కొత్త అసెంబ్లీ స్టార్ట్

ఆ మీదట సభలో సీఎం మంత్రులు సహా మొత్తం 175 ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణాలు చేయిస్తారు

By:  Tupaki Desk   |   18 Jun 2024 3:37 AM GMT
24 నుంచి ఏపీ కొత్త  అసెంబ్లీ స్టార్ట్
X

ఏపీ కొత్త అసెంబ్లీ ఈ నెల 24 నుంచి స్టార్ట్ కాబోతోంది. మూడు రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరుగుతాయని అంటున్నారు. తొలి రోజున ప్రొటెం స్పీకర్ గా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే సీట్లో కూర్చుంటారు. ఆయన చేత గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. ఆ మీదట సభలో సీఎం మంత్రులు సహా మొత్తం 175 ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణాలు చేయిస్తారు. ఈ ఘట్టం రెండు రోజుల పాటు సాగే వీలుంది.

ఇక ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ ని ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారు. ఆయనను స్పీకర్ ఆసనం మీద కూర్చోబెట్టిన మీదట కొత్త స్పీకర్ ని అభినందిస్తూ ఉద్దేశించి ముఖ్యమంత్రి మంత్రులు సభ్యులు ప్రతిపక్ష వైసీపీ వస్తే ఆ పార్టీ సభ్యులు అందరూ ప్రసంగాలు చేస్తారు.

ఇక చివరిగా కొత్త స్పీకర్ సభను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. సభను రానున్న అయిదేళ్ల పాటు మొత్తం సభ్యులందరి సహకారంతో సజావుగా నడుపుతామని స్పీకర్ చెబుతూ కొత్త సభకు స్వాగతం పలుకుతారు. అనంతరం మూడు రోజుల పాటు జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.

ప్రస్తుతానికి అయితే ఇదే బిజినెస్ ఉండనుంది అని అంటున్నారు. ఇక ఈ నెల 24న అసెంబ్లీ అంటే వైసీపీ సభ్యులు సభకు వస్తారా అన్నది ఇక్కడ మరో మారు ప్రశ్న. అదే విధంగా ప్రతిపక్షం లేని అసెంబ్లీగా తొలి సమావేశాలు సాగుతాయా అన్నది మరో డౌట్.

ఇక వైసీపీ వచ్చినా సభను సజావుగా సాగేలా చూసేందుకు సీనియర్ ఎమ్మెల్యేనే స్పీకర్ గా చేస్తారు అని అంటున్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరు దాదాపుగా ఖరారు అయింది అని అంటున్నారు. ఆయన కనుక స్పీకర్ అయితే వైసీపీని పూర్తిగా కంట్రోల్ లో పెడతారు అన్నది వ్యూహంగా ఉంది. అయితే వైసీపీ అసెంబ్లీకి వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ప్రొటెం స్పీకర్ గా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉంటారని అంటున్నారు. ఆయన అధ్యక్షతన సభ్యులందరి ప్రమాణ స్వీకారాలు జరుగుతాయని తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే ఈసారి సమావేశాలు చాలా ఆసక్తికరంగా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.