Begin typing your search above and press return to search.

2000 మంది పోలీస్ లు .. 2 వారల శ్రమ ... విశ్వానికి యజమిని అరెస్ట్!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా చాలామంది బాబాలను.. సద్గురువులను నమ్ముతూ ఉంటారు.

By:  Tupaki Desk   |   9 Sep 2024 9:41 AM GMT
2000 మంది పోలీస్ లు .. 2 వారల శ్రమ ... విశ్వానికి యజమిని అరెస్ట్!
X

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా చాలామంది బాబాలను.. సద్గురువులను నమ్ముతూ ఉంటారు. ఇందులో కొంతమంది ప్రజలకు మంచి బోధిస్తారు కానీ కొంతమంది మాత్రం ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తారు. బాబాలు కేవలం ఒక మతానికే పరిమితం కాదు.. మతానికి ఒక పేరు పెట్టుకొని రంగులు మార్చే ఊసరవెల్లిలా తమ పని తాము చేసుకొని పోతున్నారు.

అలాంటి ఒక వ్యక్తి తానే విశ్వానికి యజమానిని అంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. ఓ పాస్టర్ ముసుగులో అతను వేస్తున్న వేషాలు.. చేస్తున్న అరాచకాలు లెక్కలేనన్ని.ఫిలిప్పీన్స్ లోని అపోలో అనే పాస్టర్ దావోవ్ నగరంలో దాదాపు 75 ఎకరాల్లో 'ది కింగ్డమ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్' పేరిట ఒక అడ్డాను నిర్మించాడు. ఆ ప్రాంగణంలో అతను ఆడింది ఆట.. పాడింది పాట..

2021లో అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అపోలో పై పలు అభియోగాలను మోపింది. చిన్న పిల్లలతో ఇల్లీగల్ వ్యాపారాలు, స్మగ్లింగ్, మాఫియా తో సంబంధాలు లాంటి అభియోగాలు అపోలో పై ఉన్నాయి. ఫిలిప్పీన్స్ నుంచి అతడు అమ్మాయిలను, చిన్నపిల్లలను అమెరికాకు దొంగతనంగా తరలిస్తున్నట్లుగా ఎస్బిఐ పేర్కొంది. చారిటీ ముసుగులు భారీ డబ్బు దందాను కూడా నడుపుతున్నాడు. అతని ఆశ్రమంలో ఉన్న మహిళలపై లైంగిక దాడులకు కూడా పాల్పడ్డాడని అభియోగం ఉంది. దీంతో అతనిని అదుపులోకి తీసుకోవడానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు సుమారు 2000 మంది పోలీసులు అతన్ని అదుపులో తీసుకోవడానికి ఆ ప్రాంగణాన్ని ముట్టడించారు. అయితే అతన్ని గుడ్డిగా నమ్మే అతని మద్దతుదారులు పోలీసులను అడుగడుగునా అడ్డగించడానికి ప్రయత్నించారు. ఓ పెద్ద సినిమా సీక్వెన్స్ లాగా సాగిన ఈ ఘటనలో ఎట్టకేలకు హెలికాప్టర్లను ఉపయోగించి అతి కష్టం మీద ఆ పాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు.

'ది కింగ్డమ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్’ప్రాంగణంలో ఒక కాలేజీతో , 75 వేల మంది కూర్చోవడానికి వసతి ఉన్న ఒక పెద్ద స్టేడియం, ప్రార్థనా మందిరం, 40 భవనాలు ఉన్నాయి. అక్కడ సుమారు 70 లక్షల మంది ఫాలోవర్స్ అతనికి ఉన్నారు. పోలీసులు తనని అరెస్టు చేయడానికి వచ్చిన సమయంలో అపోలో ఓ బంకర్ లో వెళ్లి దాక్కున్నాడు. దీంతో అతన్ని కనుక్కోవడానికి ఓ పెనిట్రేటింగ్

రాడార్ను ఉపయోగించాల్సి వచ్చింది. రెండు వారాల పాటు సాగిన ఈ ఆపరేషన్ ధాటికి తట్టుకోలేక ఎట్టకేలకు ఆదివారం నాడు తాను లొంగిపోతాను అని తన లాయర్ ద్వారా అపోలో బయటకు కబురు పంపించాడు. అయితే పోలీసులు తీసుకువెళ్లే సమయంలో తన అరెస్టు వెనక ఒక దయ్యం ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత మోడ్రన్ పీరియడ్ లో కూడా ఇటువంటి వ్యక్తులు ప్రజలను మోసం చేస్తూ ఉండడం హాస్యాస్పదంగా ఉంది.