Begin typing your search above and press return to search.

లేళ్ళ అప్పిరెడ్డికి క్యాబినెట్ హోదా.. జగన్ కి మాత్రం !

ఈ నోటిఫికేషన్ ప్రకారం లేళ్ల అప్పిరెడ్డి నియామకం నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   23 July 2024 3:28 AM GMT
లేళ్ళ అప్పిరెడ్డికి క్యాబినెట్ హోదా.. జగన్ కి మాత్రం !
X

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి క్యాబినెట్ హోదా దక్కింది. ఆయనను శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తిస్తూ ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ పేరుతో నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం లేళ్ల అప్పిరెడ్డి నియామకం నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతో లేళ్ల అప్పిరెడ్డికి ప్రోటోకాల్ అంతా వర్తిస్తుంది. ఆయనకు జగన్ కంటే కూడా పెద్ద హోదావే దక్కనుంది. నిజానికి అసెంబ్లీలో జగన్ ని ప్రతిపక్ష నేతగా గుర్తించినా పెద్దల సభలో అపోజిషన్ లీడర్ గా లేళ్ల అప్పిరెడ్డికే తొలి ప్రయారిటీ ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది.

కానీ ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదాకు సరిపడా ఎమ్మెల్యేలు లేరు. దాంతో జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఈ లేఖపై స్పీకర్ ఇంకా తన నిర్ణయాన్ని వెలువరించలేదు.

ఈ లోగా లేళ్ల అప్పిరెడ్డికి హోదా వచ్చేసింది. దాంతో ఆయనకు శాసన సభ ప్రాంగణంలో ఒక చాంబర్ కేటాయిస్తారు. ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తారు. ఆయనకు పోలీస్ సెక్యూరిటీ వంటివి కూడా ఉంటాయి.

వైసీపీకి ఇది ఒక విధంగా ఆనందమే కానీ అధినేత జగన్ కేవలం ఎమ్మెల్యేగా ఉండడం ఆయన పార్టీకి చెందిన మరో నేత మంచి హోదాలో ఉండడం అంటే అది ఒక రాజకీయ విచిత్రంగానే అంటున్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు విపక్ష నేతగా ఉంటే మండలిలో యనమల రామక్రిష్ణుడు ఉండేవారు. కానీ జగన్ విషయం అలా కాదు దాంతో ఆయనకు ఇది ఒక చిత్రమైన రాజకీయ బాధగానే అంతా అంటున్నారు.

అసెంబ్లీలో అయితే నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు అనే అంటున్నారు. మరి దీని మీద స్పీకర్ నిర్ణయం చూసిన మీదట ఏపీ అసెంబ్లీ చట్టంలో ఏముందో కూడా తెలుసుకున్న తరువాత వైసీపీ న్యాయ పోరాటం ఏమైనా చేస్తుందో ఏమో చూడాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ ని నిన్నటికి నిన్న హోం మంత్రి వంగలపూడి అనిత పులివెందుల ఎమ్మెల్యే అని సెటైర్లు వేస్తే నేడు మరో మంత్రి నారా లోకేష్ కూడా పులివెందుల ఎమ్మెల్యే గారూ అని ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు. ఇది వైసీపీ అభిమానులకు అనుచరులకు మరింతగా బాధపెడుతున్న విషయంగా ఉంది అని అంటున్నారు.