మహా కుంభమేళా ఎఫెక్ట్ కమలగా పేరు మార్చుకున్న యాపిల్ యజమాని భార్య
లారీన్ పావెలుకు ఈ నెల 10వ తేదీనే కమలగా నామకరణం చేశామని నిరంజనీ అఖాడా మహా మండలేశ్వర్ కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు.
By: Tupaki Desk | 14 Jan 2025 7:30 AM GMTయాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ తన పేరు మార్చుకున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వచ్చిన ఆమె తన పేరును హిందూ సంప్రదాయంలో కమలగా మార్చుకున్నారు. లారీన్ పావెలుకు ఈ నెల 10వ తేదీనే కమలగా నామకరణం చేశామని నిరంజనీ అఖాడా మహా మండలేశ్వర్ కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు.
లారీన్ భారతదేశానికి రావడం ఇది రెండోసారి. ధాన్యం చేయడానికి ఆమె నిరంజన్ అఖాడాకు వస్తుంటారని కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు. మహాకుంభమేళా వేళ నిరంజనీ అఖాడా నిర్వహించే శోభాయాత్ర (పేష్వాయి)లో కమల పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. మన సంప్రాదయాల కోసం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న లారీన్ కుంభమేళాలో పాల్గొనే సాధువులను కలుసుకోవాలని భావిస్తున్నారు.
జనవరి 29 వరకు స్వామి కైలాసనంద గిరి మహారాజ్ ఆశ్రమానికి చెందిన ఆశ్రమంలోనే కమల ఉంటారని నిరంజన్ అఖాడా ప్రతినిధులు తెలిపారు. భారత్ చేరుకున్న వెంటనే కాశీకి వెళ్లిన కమల మహా కుంభమేళా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని మహాదేవుడ్ని పూజించినట్లు చెప్పారు. మహా కుంభమేళాకు దేవుడిని ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చానంటూ కమల తెలిపారు. ఫిబ్రవరి 26 వరకు జరగనున్న కుంభమేళాకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు.