Begin typing your search above and press return to search.

యాపిల్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. లాక్ చేసుకోండి బాస్

టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే యాపిల్ ఈవెంట్ డే ఖరారైంది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 4:21 AM GMT
యాపిల్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. లాక్ చేసుకోండి బాస్
X

టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే యాపిల్ ఈవెంట్ డే ఖరారైంది. అది కూడా అధికారికంగా. ఇప్పటివరకు అంచనాల మీద అంచనాలే తప్పించి.. వాస్తవంగా డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారనన సమాచారం లేదు. తాజాగా ఈ వేడుకను వచ్చే నెల (సెప్టెంబరు) 9న నిర్వహించనున్నట్లుగా యాపిల్ ప్రకటించింది. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ప్రియులు ఉత్కంటగా ఎదురుచూస్తున్న రోజు డిసైడ్ అయినట్లే.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహించే యాపిల్ ఈవెంట్ డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎప్పుడూ సెప్టెంబరు రెండో వారంలో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తారు. గత ఏడాది మాత్రం సెప్టెంబరు 12న కాలిపోర్నియాలో నిర్వహించగా.. అంతకు ముందు ఏడాది సెప్టెంబరు 7న ఈవెంట్ ను నిర్వహించారు. అయితే.. ఈసారి సెప్టెంబరు 10న వేడుక చేస్తారన్న ప్రచారం జరిగినా.. అధికారికంగా మాత్రం వచ్చే నెల 9న నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు.

కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటల వేళలో ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ చూసే వీలుంది.ఈసారిఈవెంట్ కు ‘‘ఇట్స్ గ్లో టైమ్’’గా పేర్కొన్నారు. ఈసారి ఈవెంట్ లో స్పెషల్ ఏమంటే.. ఐఫోన్ 16 సిరీస్ తో పాటు.. యాపిల్ వాచ్.. ఎయిర్ పాడ్స్ ప్రొడక్ట్స్.. కొత్తగా హార్డ్ వేర్ ను ప్రకటించే వీలుంది. ఈసారి విడుదలయ్యే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రానున్నట్లుగా చెబుతున్నారు.

ఐ ఫోన్ 16 సిరీస్ విషయానికి వస్తే.. మొత్తం నాలుగు మోడళ్లను విడుదల చేస్తారని చెబుతున్నారు. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్.. ఐఫోన్ 16 ప్రో.. ఐఫోన్ 16 ప్రోమాక్స్ ప్రకటించే వీలుంది. ఈసారి అన్ని మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ప్రో మోడల్స్ లో మాత్రమే యాక్షన్ బటన్ పరిచయం చేశారు. ఈసారి అన్ని మోడళ్లలో లేటెస్ట్ జెన్ హార్డ్ వేర్.. ఏఐతో రానున్న ఐఫోన్ల మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.