కీలక నేతలకు సెగ పెడుతున్న 'పొత్తు'.. చివరకు జరిగేదేంటి...!
ఇంత వరకు బాగానే ఉంది. అంతేకాదు.. ఉమ్మడి ఉద్యమాలు, నిరసనలు కూడా చేపట్టాలని పిలుపుని చ్చారు. కార్యాచరణకు నడుం కూడా బిగించారు
By: Tupaki Desk | 18 Nov 2023 9:44 AM GMTపొత్తులు పెట్టుకుని వైసీపీని ఓడించాలనే లక్ష్యం ఒకవైపు. అదేసమయంలో కీలక నియోజకవర్గాల్లో నాయకులను ఎలా మేనేజ్ చేయాలనే ఆలోచన మరోవైపు!! ఇదీ.. ఇతమిత్థంగా టీడీపీ-జనసేన పార్టీల అధినాయకత్వాల దగ్గర జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం. దీనికి బీజేపీ కలిసి వస్తుందా? రాదా? అనేది వేరే సంగతి. ఎలా ఉన్నా.. పొత్తులతోనే ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి.
ఇంత వరకు బాగానే ఉంది. అంతేకాదు.. ఉమ్మడి ఉద్యమాలు, నిరసనలు కూడా చేపట్టాలని పిలుపుని చ్చారు. కార్యాచరణకు నడుం కూడా బిగించారు. సో.. ఇంత వరకు కూడా బాగానే ఉంది. అయితే.. ఎ టొచ్చీ.. కీలక నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు ఇరు పార్టీలకూ అంతు చిక్కడం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని టీడీపీ తరఫున జలీల్‌ఖాన్ కోరుతున్నారు. ఇక, ఇదే పార్టీలో ఎంపీ కేశినేని కూడా తనకు ఈ టికెట్ ఇస్తే.. కుమార్తెను రంగంలోకి దింపి గెలిపిస్తానని చెబుతున్నారు.
అంటే.. టీడీపీలోనే ఇద్దరు పోటీ పడుతున్నారు మరోవైపు.. ఇదే నియోజకవర్గం నుంచిపోటీకి జనసేన కీలక నాయకుడు.. పోతుల మహేష్ పోటీలో ఉన్నారు ఈయనకు కాదనే పరిస్థితి లేదు. అలాగని అటు టీడీపీ నేతలను కూడా హర్ట్ చేయలేరు. దీంతో ఇక్కడ తర్జన భర్జన ఏర్పడింది. ఇదిలావుంటే.. సీటు కోసం పట్టుబడుతున్న పోతుల.. అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇదిలావుంటే, అనంత పురం అర్బన్ టికెట్‌ను జనసేన అధినేత పవన్‌కు సన్నిహితుడు ఒకరు కోరుతున్నారు.
కానీ, ఇక్కడ టీడీపీకి వైకుంఠం ప్రభాకర చౌదరి ఉన్నారు. ఈయన పవన్ వస్తానంటే..ఇక్కడ నుంచి పోటీ చేస్తానంటే.. త్యాగం చేస్తానని చెబుతున్నారు. కానీ, మరోనేతకు మాత్రం ఇచ్చేది లేదంటున్నారు. కానీ, పవన్ ఇక్కడ నుంచి పోటీ చేసే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ కూడా గందరగోళం ఏర్పడింది. ఇక, రాజ మండ్రి రూరల్‌ను కందుల దుర్గేష్ కోరుతున్నారు. కానీ, ఇక్కడ బుచ్చయ్య ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని గతంలో చెప్పినా.. ఇప్పుడు మాత్రం ఆయన టంగ్ మార్చారు. పోటీకి రెడీ అయ్యారు.
కాకినాడ ఎంపీ టికెట్‌ను నాగబాబు ఆశిస్తున్నారు. తెనాలి టికెట్‌ను నాదెండ్ల మనోహర్ రిజర్వ్ చేసుకు న్నారు. ఇలా.. కీలక నియోజకవర్గాల్లో జనసేన కర్చీఫ్ పరచడంతో అక్కడి టీడీపీ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. నరసాపురం ఎంపీ వరకు ఓకే.. మరి అసెంబ్లీ టికెట్ పరిస్థితిపైనా ఇరు పార్టీల మధ్య రచ్చ తెరమీదికి వచ్చింది. నగరి నియోజకవర్గాన్ని కిరణ్ రాయల్ కోరుతున్నారు. కానీ, ఇక్కడ గాలి ముద్దుకృష్ణమ కుమారుడు ఉన్నారు. ఇలా.. చాలా వరకు కీలక నియోజకవర్గాలు టీడీపీ-జనసేనల అధినాయకత్వాలకు పరీక్ష పెడుతున్నాయి. మరి చివరకు ఏం చేస్తారో చూడాలి.