ఇది పొలిటికల్ 'టచ్'- అందరూ అందరే!!
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది
By: Tupaki Desk | 30 May 2024 4:30 PM GMTరాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్‌లో భారీ ఎత్తున ప్రజలు పోటెత్తి మరీ ఓటేశారు. కనీ వినీ ఎరుగని రీతిలో పోలింగ్ నమోదైంది. దీంతో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 80 శాతం దాటిన దరిమిలా.. ఎవరు గెలుస్తారనే విషయంపై సందేహాలు ముసురుకున్నాయి. సరే.. ఈ ఫలితం ఏంటనేది జూన్ 4న తేలిపోతుంది.
ఇదిలావుంటే.. పార్టీలకు ఇప్పుడు అభ్యర్థుల పరేషాన్ పట్టుకుంది. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. అభ్య ర్థుల విషయంలో పార్టీలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఉదాహరణకు టీడీపీ నేతృత్వంలోని కూటమి గెలిస్తే.. ఏం జరుగుతుంది? అంటే.. వైసీపీ నుంచి గెలిచిన వారిలో సగం మంది వరకు.. ఆ పార్టీలోకి జంప్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు ఆయా ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తమపై కేసులు పెడతారనే భయం వైసీపీ నేతలను వెంటాడుతోంది.
దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు చాలా లోతుగా ఫలితంపై అంచనాలు వేసుకుంటున్నారు. ఇదేసమ యంలో వైసీపీ గెలిచినా.. ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వస్తుండడం గమనార్హం. వైసీపీ వచ్చినా.. తమపై కేసులు పెట్టి వేధిస్తారని కొందరు భావిస్తున్నారు. దీంతో ఇలాంటి వారు కూడా.. వైసీపీకి టచ్‌లో ఉన్నారు. అందుకే.. పలితంపై ఎవరూ మాట్లాడడం లేదు. పైగా మౌనంగా ఉంటున్నారు. ఈ పరిణామాలు ఇటు టీడీపీ, అటు వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారాయి.
ఉదాహరణకు తిరుపతి నుంచి బరిలో ఉన్న ఓ నేత.. ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. తిరుపతి పార్లమెంటు నుంచి బరిలో ఉన్నమరో నాయకుడు కూడా.. అధికార పార్టీపై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా పలువురు నాయకులు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఇక, వైసీపీ నుంచి పోటీ చేసిన వారు కూ డా.. కొందరు టీడీపీ నేతలకు టచ్‌లో ఉన్నారు. ఇలా.. పదుల సంఖ్యలో జూన్ 4 తర్వాత.. ఏం జరిగినా.. తమ తమ రాజకీయ భవితవ్యాన్ని సేఫ్ ప్లేస్ లో చూసుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.