Begin typing your search above and press return to search.

జగన్ కి నో టీం... బాబుకు హై టైం !

జగన్ కి అయిదేళ్ల పాటు వ్యూహాలను అందిస్తూ పార్టీకి పనిచేసి పెట్టిన ఐ ప్యాక్ టీం ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది

By:  Tupaki Desk   |   6 July 2024 1:30 PM GMT
జగన్ కి నో టీం... బాబుకు హై టైం !
X

ఏపీలో రాజకీయాలు మారిపోతున్నాయి. వారు వీరు అయ్యారు. అధికారంలోకి టీడీపీ వచ్చింది. అధికారం నుంచి అవమానకరమైన పరిస్థితుల్లో వైసీపీ దిగిపోయింది. కేవలం 11 సీట్లే వైసీపీకి దక్కాయి. వై నాట్ 175 అని స్ట్రాంగ్ గా స్లోగన్స్ ఇస్తే దక్కినవి ఈ నంబరే అని అంటున్నారు.

జగన్ కి అయిదేళ్ల పాటు వ్యూహాలను అందిస్తూ పార్టీకి పనిచేసి పెట్టిన ఐ ప్యాక్ టీం ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. దాంతో వైసీపీ ఐ ప్యాక్ టీం ని వదిలించేసుకుంది. రాజకీయంగా లాభం లేని చోట ఈ టీం ఎందుకు దండుగ అని వైసీపీ అధినాయకత్వం భావించింది అని అంటున్నారు.

దాంతో ప్రస్తుతానికి చూస్తే వైసీపీకి టీం అంటూ ఎవరూ లేరు. జగన్ కి రాజకీయ వ్యూహాలు ఇచ్చే పొలిటికల్ కన్సల్టెన్సీ లేదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే ఐ ప్యాక్ టీం చేసిన పనుల వల్లనే పార్టీ ఘోరంగా ఓడింది అని అంటున్నారు. పైగా పార్టీలో కొత్త చిచ్చు కూడా మొదలై అనేక వర్గాలుగా మారి చివరికి పార్టీయే పోయింది అన్నట్లుగా కూడా నేతల ఆగ్రహం ఉంది.

ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి కొత్త అభ్యర్ధిని పెడితే సిట్టింగ్ ఎమ్మెల్యే డీ మోరలైజ్ అయ్యాడు, అలాగే ఆశావహులు సైలెంట్ అయ్యారు. పార్టీలో గ్రూపులు పుట్టుకుని వచ్చాయి. ఇదే చివరికి దెబ్బ కొట్టింది అని అంటున్నారు. ఈ సలహాలు ఇచ్చిన ఐ ప్యాక్ టీం ని వదిలించుకోవాలని కూడా వైసీపీ నేతలు కోరారు. అలాగే వారు చేసిన సర్వేలు అన్నీ తప్పుడు తడకలు అని సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వారికి నచ్చినట్లుగా రిపోర్టులు ఇచ్చి బలమైన వారే పార్టీకి దూరం అయ్యేలా చేశారు అని అంటున్నారు. అలాగే వాలంటీర్లకు పార్టీ పెత్తనం అప్పగించడం వంటి వాటివల్లనే వైసీపీ ఘోరంగా నష్టపోయింది అని అంటున్నారు.

దీంతో పాటు వైసీపీ అధినాయకత్వం కూడా పార్టీకి నాయకులు క్యాడర్ కి మధ్య ఐ ప్యాక్ టీం అనవసరం అనుకుందో ఏమో వద్దు అనేసుకుంది అని అంటున్నారు. దాంతో ఐ ప్యాక్ టీం సేవలు వైసీపీకి లేనట్లే. మరి జగన్ ఎన్నికలు దగ్గర చేసి కొత్తగా పొలిటికల్ కన్సెటెన్సీని తెచ్చుకుంటారో ఏమో తెలియదు కానీ ఈ రోజుకు జగన్ కి నో టీం అని అంటున్నారు.

సరిగ్గా ఇదే టైం లో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు రాబిన్ శర్మ టీం మరింత కాలం పనిచేసేలా ఒప్పందాలు కుదిరాయని అంటున్నరు. అటు సీఎం గా ఇటు పార్టీ అధినేతగా ఉన్న బాబు బిజీగా ఉంటారు. దాంతో పార్టీని పటిష్టం చేసే విషయంలో రాబిన్ శర్మ టీం నుంచి ఎప్పటికపుడు సలహా సూచనలు తీసుకోవడానికి ఆ టీం సేవలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అని అంటున్నారు.

అలాగే ప్రభుత్వ పధకాల అమలు మీద ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఇవ్వడం, పార్టీ పరంగా గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పరిస్థితుల గురించి తరచూ సమగ్రమైన నివేదికలను ఇవ్వడం వంటివి చేస్తుంది అని అంటున్నారు. టీడీపీ ఇపుడు అధికార పార్టీ. సహజంగా ప్రజలకు ఆ పార్టీ మీద ఫోకస్ ఉంటుంది. అదే టైంలో యాంటీ ఇంకెంబెన్సీ పెరిగే చాన్స్ ఉంటుంది.

అలా కాకుండా ఎప్పటికపుడు తప్పులు సరిచేసుకోవడానికి వీలుగానే రాజకీయ పరమైన సేవల కోసమే రాబిన్ శర్మ టీం ని ఉపయోగించుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. తాజాగా చంద్రబాబు ఈ టీం తో భేటీ అయి టీడీపీకి ఏమి చేయాలి అన్న దానిని విడమరచి చెప్పారని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ కి నో టీం బాబుకు ఇది హై టైం అని అంతా అంటున్నారు.