ఆంద్రోళ్ళూ మీకు జోహార్లు : గిఫ్ట్...రిటర్న్ గిఫ్ట్... !
ఇక ఏపీ రాజకీయాల్లో అయితే గిఫ్టులు రిటర్న్ గిఫ్టులు ఏవీ లేవు. ఎవరూ వాటిని వాడడంలేదు. కానీ సడెన్ గా లోకేష్ బాబు కాచుకో జగన్ మేము నీకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని ఒక భారీ ప్రకటన చేశారు.
By: Tupaki Desk | 28 Sep 2023 3:00 AM GMTరిటర్న్ గిఫ్ట్ అన్న మాటను పొలిటికల్ గా కేసీయార్ బాగా పాపులర్ చేశారు. ఆయన 2018 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు ఒక గిఫ్ట్ ఇచ్చారని దానికి తాను కూడా మర్యాదగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటూ సెటైర్లు వేశారు. ఇంతకీ నాడు చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే కేసీయార్ ని ఓడించడానికి కాంగ్రెస్ తో కలసి కూటమి కట్టడం. ఒక విధంగా ఊపిరి ఆడకుండా అష్టదిగ్బంధనం చేశారు.
అయితే ఆంధ్రా పెత్తనం అంటూ తెలంగాణా సెంటిమెంట్ ని టైం లీ గా కేసీయార్ రగిలించడం, అది సరైన విధంగా జనాలు రిసీవ్ చేసుకోవడంతో రెండవసారి దిగ్విజయంగా కేసీయార్ గెలిచారు. ఆ తరువాత ఆయన జగన్ కి ఏపీ ఎన్నికల్లో హెల్ప్ చేసి రిటర్న్ గిఫ్ట్ బాబుని ఇచ్చారు అంటారు. బాబు ఇచ్చిన గిఫ్ట్ కేసీయార్ ని సీఎం గా గెలిపిస్తే కేసీయార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాబుని మాజీ సీఎం గా మార్చింది. దాంతో గిఫ్ట్ కంటే రిటర్న్ గిఫ్ట్ పవర్ ఏంటో అందరికీ తెలిసింది.
ఇక ఏపీ రాజకీయాల్లో అయితే గిఫ్టులు రిటర్న్ గిఫ్టులు ఏవీ లేవు. ఎవరూ వాటిని వాడడంలేదు. కానీ సడెన్ గా లోకేష్ బాబు కాచుకో జగన్ మేము నీకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని ఒక భారీ ప్రకటన చేశారు. దాంతో మళ్లీ ఇది చర్చకు వచ్చింది. తన తండ్రి చంద్రబాబుని అరెస్ట్ చేశారు అన్న ఆవేదన ఆగ్రహంతో లోకేష్ ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు.
వచ్చేది తమ ప్రభుత్వం కాబట్టి తాము కూడా కేసులు పెట్టి జైలుకు పంపి జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని లోకేష్ చెప్పిన దానికి అర్ధం అంటున్నారు. కానీ అసలు మొదట జగన్ కి గిఫ్ట్ ఇచ్చిందే మీ బాబు చంద్రబాబు అని ఆ విషయం తెలుసుకో లోకేష్ అని వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. తన మానాన తాను కాంగ్రెస్ లో ఉంటూ తన రాజకీయ అస్తిత్వం కోసం జగన్ పోరాడుతూంటే తగుదునమ్మా అని మధ్యలోకి దిగి టీడీపీకి బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ తో చేతులు కలిపి మరీ జగన్ని పదహారు నెలలు జైలులో వేయించింది ఎవరు లోకేష్ అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అలా మొదట కెలికి కేసులు పెట్టించింది జైలుకు పంపించింది బాబు అయినపుడు రిటర్న్ గిఫ్ట్ బాబే కదా అందుకోవాలి. అందుకే ఆయన అందుకున్నారు ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకూ అంటున్నారు. దీంతో చెల్లుకు చెల్లు అయిపోయింది అని అంటున్న వారూ ఉన్నారు. కానీ లోకేష్ మాటలు కానీ చంద్రబాబు అంతకు ముందు చేసిన ప్రకటనలు కానీ టీడీపీ నేతల డైలాగులు కానీ చూస్తే జగనే కోరి కెలికినట్లు. తాము దానికి రిటర్న్ గిఫ్ట్ అని కక్ష తీర్చుకుంటామని అందుకే అధికారం ఇవ్వాలని పదే పదే కోరుతున్నట్లుగా ఉంది అంటున్నారు.
ఇక ఏపీ జనాలు అయితే ఈ ప్రతీకార రాజకీయాల మధ్య నలుగుతున్నారు అనే చెప్పాలి. జగన్ ఎపిసోడ్ లో 2009 నుంచి 2019 దాకా బాధలతో నలిగిన నేతగా ఉన్నారని, 2019 నుంచి అధికారంలోకి వచ్చాకనే కదా టీడీపీకి ఇక్కట్లు వచ్చాయని అంటున్న వారూ ఉన్నారు. జగన్ మీద కేసుల నుంచి మొదలెట్టి ఆయన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని ఆయన్ని ఆయన పార్టీని ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది మరచిపోయి తామేదో కొత్తగా బాధలు పడుతున్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతూంటే జనాలకు అన్నీ గుర్తు ఉంటాయని అంటున్నారు.
ఏది ఏమైనా జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల సమస్యల మీదనే ఫోకస్ పెట్టాలని, అంతే తప్ప మేము వస్తే మీ సంగతి తేలుస్తామని చెబుతూ దానికి పవర్ కావాలని జనాలను ఓట్లు అడిగితే జనాల ఓర్పునే పరీక్షించినట్లు అంటున్నారు. నిజానికి ప్రజలకు ఇవేమీ అవసరం లేదని అంటున్నారు మేధావులు.
ఏపీ విభజన తరువాత అన్ని విధాలుగా నష్టపోయిందని, ముందు దాని మీద ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ చేయాలని అలా చేసిన వారినే జనాలు ఆదరిస్తారని అంటున్నారు. ఇక పడ్డవాడు చెడ్డవాడు కాదని ఒక సామెత ఉంది. పోనీ టీడీపీ వారు మంచివారు వైసీపీ వారు నానా బాధలు పెట్టారు అనుకున్నా కూడా పక్కన ఉన్న తమిళ సీఎం స్టాలిన్ మాదిరిగా పెద్ద మనసుతో ప్రత్యర్ధులను క్షమించి పాలన చేస్తే శభాష్ అని మెచ్చుకోరా అని కూడా అంటున్న వారు ఉన్నారు. మరి ఇవి రెండు పార్టీలుగా రెండు బలాలుగా అటూ ఇటూ మోహరించిన వారికి ఇవన్నీ వినిపిస్తాయా. ఏమో చూడాల్సిందే.