ఏపీ పాలిటిక్స్‌లో జంపింగ్‌లే జంపింగ్‌లు... అదిరిపోయే ట్విస్టులు..!
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు కీలకంగా భావిస్తున్న జంపింగుల పర్వం రేపో మాపో ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 19 Jan 2024 12:30 AM GMTఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు కీలకంగా భావిస్తున్న జంపింగుల పర్వం రేపో మాపో ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాయకులు ఇప్పటికే గేర్ మార్చేందుకు రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిలను కలిసేందుకు.. తమ డిమాండ్లు వినిపించేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. అయితే.. ఇక్కడ ప్రధానంగా ఎవరెవరు వెళ్తారు అనేది చర్చగా మారింది.
ఈ విషయాన్ని తరచి చూస్తే.. వైసీపీలో కొన్నాళ్లుగా కొందరు నాయకులను పక్కన పెడుతున్నారు. వీరిలో వైఎస్ అనుంగులుగా ఉన్నవారు.. పొరుగు పార్టీలతో టచ్‌లో ఉన్నారనే వాదన ఉన్నవారిని మాత్రమే వైసీపీ అధినేత పక్కన పెడుతున్నారు. ఇలాంటివారే ఇప్పుడు కాంగ్రెస్‌కు తురుపు ముక్కలుగా మారతా రనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చేందుకు కూడా పార్టీ రెడీ గానే ఉంది. సో.. వీరికి రెండు రకాలుగా ప్రయోజనం జరగవచ్చు.
అయితే, ఎన్నికల వేళ.. వారు పార్టీ మారుతున్నా.. టికెట్‌లు తెచ్చుకుంటున్నా.. రాష్ట్రాన్ని విభజించా రన్న కాంగ్రెస్‌ను ప్రజలు ఇప్పుడు ఏమేరకు ఆదరిస్తారనే వాదన ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ తాముప్రకటించిన ప్రత్యేక హోదా కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆమేరకు దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లిన నాయకులు లేరు. ఇప్పుడు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా.. ఏమేరకు ఫలిస్తుందనేది కూడా ప్రశ్నగా మారింది.
మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కు స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకు.. ఈ జంపింగ్ నేతలకు ఎంత వరకు కలిసి వస్తుంనేది కూడా ప్రధానంగా చూడాలి. పార్టీలు మారేవారిని ఆదరిస్తున్న పరిస్థితి గత ఎన్నికల్లోనూ చూడలేదు. వైసీపీ నుంచి 23 మంది నేతలు పార్టీలు మారితే.. ఒకే ఒక్క నేత(గొట్టిపాటి రవికుమార్-అద్దంకి) మాత్రమే విజయం దక్కించుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితి జంపింగులు బాగానే ఉన్నా.. నేతల చేతి చమురు వదలడం తప్ప.. లాభం ఎంత వరకు అనేది చూడాలి.