Begin typing your search above and press return to search.

టీడీపీ.. ఆప‌రేష‌న్ 'కౌన్సిల్‌'.. విష‌యం ఏంటి?

దీంతో ఇప్పుడు టీడీపీ ఆప‌రేష‌న్ కౌన్సిల్‌కు రంగం రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో అధినేత‌ను ఎదిరించిన నాయ‌కులు క‌నిపించ‌లేదు.

By:  Tupaki Desk   |   24 July 2024 12:30 PM GMT
టీడీపీ.. ఆప‌రేష‌న్ కౌన్సిల్‌.. విష‌యం ఏంటి?
X

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డింది. శాస‌న స‌భ‌లో లెక్క‌కు మించిన స‌భ్యుల‌తో టీడీపీ నేతృత్వంలో స‌ర్కారు దూకుడుగా ఉంది. ఇక్క‌డ ఎవ‌రూ కూట‌మి స‌ర్కారుకు అడ్డు చెప్పేవారు.. పెట్టేవారు కూడా లేరు. అయితే.. ఎటొచ్చీ.. శాస‌న మండ‌లిలోనే స‌మ‌స్య‌. శాస‌న స‌భ‌లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఇబ్బందిలేక‌పోయినా.. అక్క‌డ పాస్ చేసిన బిల్లును మండ‌లికి తీసుకువ‌స్తే.. ఇక్క‌డ మాత్రం అడ్డంకులు త‌ప్ప‌వు. ఎందుకంటే.. వైసీపీకి ఇక్క‌డ 38 మంది స‌భ్యులు ఉన్నారు. దీంతో వీరంతా కూడా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల ప్ర‌కారం న‌డుచుకుంటారు.

ఫ‌లితంగా గ‌తంలో వైసీపీ స‌ర్కారుకు ఎలా అయితే..ఇబ్బందులు ఎదుర‌య్యాయో.. ఇప్పుడు అదే ప‌రి స్థితి కూట‌మికి కూడా ఎదురు కానుంది. దీంతో ఇప్పుడు టీడీపీ ఆప‌రేష‌న్ కౌన్సిల్‌కు రంగం రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో అధినేత‌ను ఎదిరించిన నాయ‌కులు క‌నిపించ‌లేదు.

దీంతో టీడీపీ ఆచి తూచి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించింది. కానీ, గ‌త నాలుగు రోజులుగా ప‌రిస్థితి మారిపో యింది. వైసీపీ అధినేత తీసుకుంటున్న ప్ర‌స్తుత నిర్ణ‌యాలు కూడా.. నాయ‌కుల‌కు న‌చ్చ‌డం లేదు. దీంతో ప‌లువురు నాయ‌కులు రాజీనామాలు చేశారు.

ఈ క్ర‌మంలోనే మండ‌లిలోనూ.. స‌గానికిపైగా వైసీపీ స‌భ్యుల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయాల ని టీడీపీ అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం స‌భ‌లో ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు మిన‌హా ఎలాంటి బిల్లు ప్ర‌వేశ పెట్ట‌లేదు. కానీ, వ‌చ్చే నెల రోజుల్లో కీల‌క‌మైన బిల్లులు ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకునే అవ‌కాశం ఉంది. దీనికి మండ‌లిలో ఎదురు దెబ్బ‌త గ‌ల‌కుండా ఉండాలంటే.. దీపం ఉండ‌గానే అంటే.. జ‌గ‌న్ పై వ్య‌తిరేక‌త వ‌స్తున్న క్ర‌మంలోనే తాము అడుగులు వేయాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో తమంత‌ట తాముగా పార్టీ మారేందుకు వ‌చ్చేవారిని తీసుకోవాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకుంది. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు 10 - 12 మంది వ‌స్తార‌ని ఒక లెక్క తేలిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే స‌మ‌యంలో మ‌రో 10 మంది వ‌ర‌కు నాయ‌కుల‌ను ఏదో ఒక ర‌కంగా తీసుకుంటే.. మండ‌లిలోనూ కూట‌మిదే పైచేయి అవుతుంద‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. దీనిపై అంత‌ర్గ‌తంగా చ‌ర్చ సాగుతోంద‌ని.. వ‌చ్చే రెండు మూడు రోజుల్లోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుని ఆప రేష‌న్ కౌన్సిల్‌ను స్టార్ చేస్తార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. మ‌రి దీనిని వైసీపీ అధినేత అడ్డుకుంటారా? చేతులు ఎత్తేస్తారా చూడాలి.