ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఇదో విచిత్రం... గమనించారా...!
ముఖ్యంగా మరో నాలుగు మాసాల్లో తెలంగాణలోను.. దీనికి అదనంగా నాలుగు మాసాల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By: Tupaki Desk | 28 July 2023 11:30 PM GMTపార్టీలపై అభిమానం ఉందంటారు. అధినేతల గీత దాటేది లేదంటారు. ఇంకేముంది.. ప్రాణాలు కూడా ఇచ్చేస్తామని చెబుతారు. ఇదంతా వినేసి నాయకులు, అధినేతలు.. నిజమే కదా! అనుకుంటారు.
కానీ, ఇక్కడ ఒక్క కట్ ఇస్తే.. ఎన్నికల సమయానికి నాయకులు వారి అసలు చిత్తాన్ని చిత్రంగా వెల్లడిస్తున్నా రు. ఆ పార్టీ ఈ పార్టీ.. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనికాదు.. దాదాపు ఏపీ, తెలంగాణల్లోని అన్ని పార్టీలూ ఇలానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా మరో నాలుగు మాసాల్లో తెలంగాణలోను.. దీనికి అదనంగా నాలుగు మాసాల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలకు చెందిన అధినేతలు, అధిష్టానాలు కూడా అలెర్ట్ అయ్యాయి. నియోజకవర్గాల్లో పార్టీలను పరుగులు పెట్టించాలని పదే పదే చెబుతున్నాయి.
అంతేకాదు.. ప్రతిపక్షాలు.. అధికార పక్షం ప్రజావ్యతిరేక విధానాలపైనా.. అధికార పక్షం ఇటు సర్కారు చేస్తున్న మంచిని.. అటు విపక్షాల దూకుడుకు కళ్లెం వేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ప్రకటిస్తున్నాయి.
చెప్పడం వరకు అయితే.. ఓకే! ఇటు నేతలు వినడం వరకు కూడా డబుల్ ఒకే! కానీ, ఎటొచ్చీ.. క్షేత్రస్థా యిలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. పార్టీ ఏదైనా.. నాయకుల చిత్రాలు ఒకే విధంగా ఉన్నాయని చెబుతున్నారు.
తమకు టికెట్ వస్తుందని ఆశ ఉంటే.. ఊపు చూపిస్తు న్నారు. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఖర్చు కూడా వెనుకాడడం లేదు. కానీ, ఏమాత్రం అధిష్టానం నుంచి అనుమానం వచ్చినా.. వెంటనే బ్రేక్ కొడుతున్నారు. పార్టీలో తూతూ మంత్రంగా పనిచేస్తున్నారు.
ఇదేమీ చోటా నేతల గురించి చెప్పడం లేదు. సీనియర్ నాయకుల నుంచి టికెట్ ఆశిస్తున్న బలమైన నాయకుల వరకు ఇలాంటి పరిస్థితే ఉంది. కొందరు ఏదో ఒక విధంగా అధిష్టానాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం ప్రయత్నించి కూడా ఫలితం లేదని భావించి సైలెంట్ అవుతున్నారు. ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు పుంజుకుంటున్నారు. ఈ పరిణామాలపై ఏం చేయాలో తెలియక అధిష్టానాలు తల పట్టుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ కావడం గమనార్హం.