Begin typing your search above and press return to search.

రిలాక్స్ మూడ్ లో వైసీపీ : టీడీపీని లైట్ తీసుకుంటున్నారా..?

అంటే మెల్లగా అది జనంలోకి చర్చకు పెట్టి వచ్చేది టీడీపీయ ఓడేది వైసీపీయే అని చెప్పకనే చెబుతున్నారు అన్న మాట

By:  Tupaki Desk   |   3 Aug 2023 4:06 AM GMT
రిలాక్స్ మూడ్ లో వైసీపీ : టీడీపీని లైట్ తీసుకుంటున్నారా..?
X

ఏపీలో విపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వీర లెవెల్ లో దూకుడు చేస్తోంది. చంద్రబాబు 2023 నుంచి ఒక ప్లాన్ ప్రకారం పార్టీని పట్టాలెక్కించేశారు. తన కుమారుడు లోకేష్ ని పాదయాత్ర ద్వారా నిరంతరం జనంలో ఉంచేశారు. దాంతో ప్రతీ రోజూ లోకేష్ ఎక్కడో ఒక చోట బహిరంగ సభ నిర్వహిస్తూ వైసీపీని ఎండగడుతున్నారు.

దానికి తోడు అన్నట్లుగా చంద్రబాబు కూడా కలియ తిరుగుతున్నారు. ఆయన ఏదో ఒక ప్రోగ్రాం అని ఎంచుకుని మరీ జనంలోకి వస్తున్నారు. అలా ఆయన రాయలసీమ వైసీపీ కోటను బద్దలు కొట్టే పనిని సీరియస్ గా చేస్తున్నారు. ఇక చూస్తే అటు లోకేష్ సభలకు జనాలు పోటెత్తుతున్నారు. అదే టైం లో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జనాలు బాగానే హాజరవుతున్నారు.

లోకేష్ తన స్పీచ్ ని మార్చేసారు. అగ్రెసివ్ మోడ్ లోకి దిగిపోయి జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు సైతం తాట తీస్తాను అంటూ కొత్త పదజాలాన్ని వాడుతున్నారు. తాను గతంలో బాబుని కాదు అంటూ వార్నింగులే ఇస్తున్నారు. ఇక చంద్రబాబు లోకేష్ ల నోట ఒక్కటే మాట వస్తోంది. జస్ట్ ఆరు నెలలు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది. అందరికీ మేలు చేస్తామని.

అంటే మెల్లగా అది జనంలోకి చర్చకు పెట్టి వచ్చేది టీడీపీయ ఓడేది వైసీపీయే అని చెప్పకనే చెబుతున్నారు అన్న మాట. ఈసారి టీడీపీ గెలవడం వైసీపీ ఓడిపోవడం ఖాయమని కూడా అంటున్నారు అంతే కాదు తమ ప్రభుత్వం వచ్చేసింది అన్నట్లుగానే వివిధ కార్యక్రమాలు పధకాల గురించి కూడా హామీలు ఇస్తున్నారు. ఇదంతా హిప్నటైజ్ పద్ధతిలో సాగుతోంది.

జనాల్లో మెల్లగా ఇది చర్చగా మరి వారి మైండ్ సెట్ పూర్తిగా టీడీపీ వైపుగా పాజిటివ్ గా మారాలన్నదే టీడీపీ మాస్టర్ ప్లాన్. ఇక జగన్ ఏమీ చేయలేదు అంటూ తండ్రీ కొడుకులు ఇద్దరూ వివిధ అంశాలను ఎంచుకుని ఘాటు విమర్శలు చేస్తూంటే సంబంధిత మంత్రులు దానికి శాఖాపరంగా జవాబులు చెప్పాల్సింది మాని వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దాంతో అసలు సబ్జెక్ట్ అన్నది జనంలోకి నెగిటివ్ గా పోతోంది.

నీటి పారుదల శాఖ మీద ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు గట్టిగా గదమాయిస్తూంటే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందట్లో సడేమియా అన్నట్లుగా బ్రో సినిమా వివాదంలో మునిగితేలుతున్నారు. అంటే ఆయన సరైన టైం లో కాడె వదిలేశారు అని అంటున్నారు. ఏపీలో ఏమీ అభివృద్ధి సాగడంలేదు అని పెదబాబు చినబాబు పదునైన కామెంట్స్ చేస్తూంటే వైసీపీ నుంచి సరైన సమాధానం ఇచ్చేవారు లేరు అని అంటున్నారు.

మంత్రులు పాతిక మంది ఉన్నా కూడా సబ్జెక్ట్ తో ప్రత్యర్ధి పార్టీని సైలెంట్ గా చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడంలేదు. వై నాట్ 175 అంటూ మాట్లాడుతూ కొందరు వైసీపీ నేతలు టైం పాస్ చేస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి వైసీపీ ఫుల్ రిలాక్స్ మూడ్ లో ఉంది. టీడీపీని ఇద్దరు బాబులను లైట్ తీసుకుంటోంది.

కానీ తండ్రీ కొడుకుల సభలకు జనాలు పోటెత్తుతున్నారు. దాని మాటేంటి, నిజంగా మార్పు అన్నది మొదలైందా. అదే జరిగితే రివర్స్ అటాక్ చేసేందుకు వైసీపీ వద్ద ఉన్న అస్త్రాలు ఏంటి అన్నది మాత్రం ఈ రోజుకీ తెలియడం లేదు అని అంటున్నారు. సో ఏపీలో రాజకీయాన్ని తమకు అనుకూలం చేసుకునేందుకు బాబు వేస్తున్న ఎత్తులు ఫలిస్తున్నాయా అంటే జవాబు మరి కొద్ది నెలలలోనే తెలుస్తుంది అంటున్నారు.