అమెరికా ఎన్నికల్లో ఏఆర్ రెహమాన్ ఎంట్రీ!.. ఏఏపీఐ ఇంట్రస్టింగ్ పోస్ట్!
మరోపక్క ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన (పోస్ట్) రాలేదు.
By: Tupaki Desk | 11 Oct 2024 10:59 AM GMTమరికొన్ని వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ మధ్య ఇప్పటికే మాటల యుద్ధాలు పీక్స్ కి చేరాయి. ఈ క్రమంలో హామీలు ఓ పక్క.. విమర్శలు ప్రతి విమర్శలు ఓ పక్క అంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి.
ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నస్థాయిలో ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా కమలా హారిస్ మద్దతు సభలో ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఉండబోతుందని ఏఏపీఐ ప్రకటించింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార కార్యక్రమాలతో దూకుడు పెంచుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... తరచూ పలు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అన్ని రాష్ట్రాల్లోను అన్నివర్గాల ప్రజల మద్దతును కూడగట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది.
ఈ మేరకు "ది ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్" (ఏఏపీఐ) నిధుల సేకరణ బృందం ఓ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా.. త్వరలో దేమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు మద్దతుగా ఏర్పాటుచేస్తున్న ఓ సభలో ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఉంటుందని వెల్లడించింది. ఇప్పుడు ఈ ప్రకటన సంచలనంగా మారింది.
అయితే.. కాన్సర్ట్ తేదీతో పాటు మిగిలిన వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. మరోపక్క ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన (పోస్ట్) రాలేదు. అయితే... డేట్ ఫిక్సైన తర్వాత రెహమాన్ నుంచి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు.