మయనాడ్ అతలాకుతలం నిపుణులు షాకింగ్ అంచనా అరేబియా!?
ఇదే సమయంలో మరికొన్ని వందల మంది ఆచూకీ లేకుండా పోవడమే.
By: Tupaki Desk | 30 July 2024 4:30 PM GMTసోమవారం అర్థరాత్రి కేరళలోని మయనాడ్ జిల్లాలో తొలి ప్రకోపం మొదలవ్వగా మంగళవారం తెల్లవారు జామున అది ఉగ్రరూపం దాల్చింది. మానవ అంచనాలకు ఏమాత్రం అందకుండా, విపత్తు నిర్వహణ అధికారుల పథకాలను తలదన్నుతూ ప్రకృతి ప్రకోపించింది. ఫలితంగా కేరళ విలవిల్లాడింది. భారీ ప్రాణ నష్టం, అంచనాలకు మించిన ఆస్తినష్టం సంభవించింది.
అకస్మిక వరదలు.. వాటికి తోడు భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో అధికరికంగా వందకు మించి మరణాలు సంభవించడంతో.. ఫైనల్ లెక్కపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని అంటున్నారు. అందుకు కారణం... శిథిలాల కింద వందల మంది చిక్కుకుపోయారనే విషయం తెరపైకి రావడమే. ఇదే సమయంలో మరికొన్ని వందల మంది ఆచూకీ లేకుండా పోవడమే.
ఈ సమయంలో అరేబియా సముద్ర పరిస్థితి తెరపైకి వచ్చింది. ఇంతటి భారీ విధ్వంసానికి.. ఫలితంగా దారితీసిన విషాదా పరిస్థితులు నెలకొనడానికీ ఓ బలమైన కారణం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా స్వల్ప వ్య్వధిలోనే దట్టమైన మేఘాలు ఏర్పడటం, తద్వారా అతిభారీ వర్షాలు కురవడానికి అసలు కారణం ఒకటుందని వాతావరణ శాత్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అవును.. కేరళ అత్యంత దారుణంఅగా అతలాకుతలం అవ్వడానికి అరేబియా మహా సముద్రం వేడెక్కడమే కారణం అని వాతావరణ శాత్రవేత్తలు పేర్కొంటున్నారు. గత రెండు వారాలుగా కొంకణ్ ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా ఉండటం వల్ల ఉపరితల ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైందని కొచ్చి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన రాడార్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ తెలిపారు!
ఇదే సమయంలో... భారీగా ఏర్పడిన వేడిగాలుల కారణంగా అరేబియా తీరంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయని.. ఫలితంగా సుదీర్ఘ సమయం పాటు మెరుపులు, ఉరుములతో కూడిన ఈ మేఘాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని ఆయన తెలిపారు. ఫలితంగా... కొండచరియలు విరిగిపడ్డాయని... ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడానికి దారి తీసిందని అన్నారు!