Begin typing your search above and press return to search.

టీడీపీ వైసీపీ రాజకీయ పంచాయతీ...భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారా ?

హిందూ ధార్మిక సన్స్థలు అయితే విచారణను కోరుతున్నారు. తప్పు అని తేలితే బాధ్యుల మీద కఠిన చర్యలకు కూడా డిమాండ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Sep 2024 11:30 AM GMT
టీడీపీ వైసీపీ  రాజకీయ పంచాయతీ...భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారా ?
X

తిరుమల దేవుడు కలియుగ దేవుడు. ఆయన దేవ దేవుడు. ప్రపంచానికి మొత్తానికి అసలు సిసలు వేలుపు. ఆయన కరుణా కటాక్షం కోసం ఎంతో మంది తిరుమలకు వస్తూంటారు. తిరుపతి లడ్డూని కళ్ళకు అద్దుకుని మరీ తింటారు. దానిని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

అటువంటి తిరుమల లడ్డూ మీద రచ్చ రాజుకుంది. ప్రపంచంలోకి శ్రీవారి భక్తులు అంతా ఇదే విషయం మీద అనుమానాలు వ్యక్తం చేసేటట్టుగ ఈ పంచాయతీ సాగుతోంది. దీని వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వారి మనోభావాలు దెబ్బ తింటున్నాయి.

ఈ విషయంలో టీడీపీ వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అలా చేయడం వల్ల మరింతగా అనుమానాలు పెరిగిపోవడం తప్ప మరేమీ ఒరిగేది లేదు. దీని మీద తప్పకుడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి. అపుడే పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయి.

ఇది ఏదో టీడీపీ వైసీపీల మధ్య సమస్య కానే కాదు, ఆస్తికత్వాన్ని నమ్మిన వారి అందరిదీ. తిరుమల దేవుడుని మనసారా ఆరాధించిన వారంతా ఈ వార్తలతో కలవరపడుతున్నారు. వారి మనోభావాలు గాయపడ్డాయి. ఆ విధంగా చేసే హక్కు ఎవరికీ లేదు. ఆరోపణలు రాజకీయ నాయకులు ఎన్నో రకాలుగా చేసుకుంటారు. అయితే వాటిలో నూటికి తొంబై తొమ్మిది శాతం గాలి పోగేసి చేసే ఆరోపణలే. దానిని ఎవరూ పట్టించుకోరు. ఎవరూ సీరియస్ గా తీసుకోరు కూడా.

కానీ ఈ రాజకీయ పంచాయతీ మధ్యలోనికి తిరుమల తిరుపతి దేవుడిని తెచ్చారు. ఏ రాజకీయం తో సంబంధం లేని ప్రపంచంలోని హిందువులను కూడా తెచ్చారు. వారంతా ఇపుడు దిగులు చెందుతున్నారు నిజం నిగ్గు తేల్చాలని కూడా పట్టుబడుతున్నారు.

అందువల్ల దీనిని లైట్ తీసుకోవడానికి అసలు వీలు లేదు. పైగా ఈ తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆషామాషీ వ్యక్తి కానే కాదు, ఏపీని ఏలుతున్న ముఖ్యమంత్రి. ఆయన కూడా తొలిసారి సీఎం అయిన వారు కాదు, నాలుగవ సారి అయ్యారు అనుభవం నిండా పండించుకున్న నాయకుడు.

ఆయన ఏది మాట్లాడాలో ఏది కూడదో తెలిసిన వారు. అంత సులువుగా ఆయన ఇలాంటి విషయాల్లో మాట్లాడరు అని అంటున్నారు. అందువల్ల బాబు ఈ విషయంలో కేవలం అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసి అక్కడితో వదిలేస్తే కాదు, దాని మీద సమగ్ర విచారణ జరిపించాలి.

విషయం బయటకు వచ్చింది కాబట్టి అంతా దీనికి ఒక లాజికల్ ఎండ్ కోరుకుంటారు. ఇదిలా ఉంటే వైసీపీ దీని మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కూడా కోరింది. అంతే కాదు సీబీఐ చేత విచారణ జరిపించినా అభ్యంతరం లేదు అని పేర్కొంది.

అలాగే కాంగ్రెస్ ఎపీ ప్రెసిడెంట్ షర్మిల కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ఎపుడో ఈ విషయం బయట పడితే ఇప్పటిదాకా విచారణ జరిపించకుండా ఎందుకు ఊరుకున్నారు అని కూడా ఆమె చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొత్తానికి జాతీయ స్థాయిలో గత రెండు మూడు రోజుల్గా ఇదే విషయం మీద అట్టుడికిపోతోంది

హిందూ ధార్మిక సన్స్థలు అయితే విచారణను కోరుతున్నారు. తప్పు అని తేలితే బాధ్యుల మీద కఠిన చర్యలకు కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద తమ రాజకీయ లబ్ధి కోసం ఆస్తిక జనులకు ముగ్గులోకి లాగారు అన్న అపప్రధ లేకుండా ఉండాలీ అంటే కనుక కచ్చితంగా ఈ విషయంలో సీబీఐ విచారణ జరగాల్సిందే. అసలు విషయాలు బయటకు రావాల్సిందే అని అంటున్నారు.