Begin typing your search above and press return to search.

సంచలనం : రాష్ట్రం మొత్తం రేవంత్ అదే అమలు చేస్తున్నాడు!

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 3:30 AM GMT
సంచలనం : రాష్ట్రం మొత్తం రేవంత్ అదే అమలు చేస్తున్నాడు!
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రజల్లో మంచి పట్టు సాధిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు ఓ మంచి కార్యక్రమం ఎంచుకున్నారు. అదే ప్రజావాణి. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తోంది.

ఇక మీదట ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారంలో ఒక రోజు ప్రజావాణి నిర్వహించి వారి సమస్యలను దూరం చేయాలని భావిస్తున్నారు. దీని కోసమే పథకంలో పలు మార్పులు చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ప్రభుత్వం మంచి ఉత్సాహంతో పని చేయడానికి సంకల్పిస్తోంది.

ప్రస్తుతం ప్రజావాణి కార్యక్రమాన్ని హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు. దీంతో పలు జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నారు. దీంతోనే ప్రజావాణిని నియోజకవర్గ కేంద్రాల్లోనే నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు.

గత ప్రభుత్వం ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. దీని వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. వారి కష్టాలను గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజావాణి ద్వారా మంచి పాలన అందించాలని భావించింది. ఈనేపథ్యంలోనే ప్రజావాణి కార్యక్రమం పురుడు పోసుకుంది.

రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు కూడా సౌలభ్యంగా ఉంటోంది. ఈ క్రమంలో ప్రజావాణి ప్రజల సమస్యలను దూరం చేసేందుకు ఉద్దేశించిందే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ప్రజా రంజక పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా ఉండదనే వాదనలు కూడా వస్తున్నాయి.