జనసేనకు ఇచ్చే సీట్లే కీలకం కాబోతున్నాయా....!?
ఇంతలో బీజేపీతో కూడా పొత్తు కలిపేందుకు తెలుగుదేశం పార్టీ చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 1 Jan 2024 3:45 AM GMTఏపీలో పొత్తు రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. కానీ అసలైన సీట్ల పంచాయతే ముందే ఉంది. ఇంతలో బీజేపీతో కూడా పొత్తు కలిపేందుకు తెలుగుదేశం పార్టీ చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే జనసేంతో టీడీపీ పొత్తు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదని అంటున్నారు.
ఈ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల మధ్య చర్చకు అయితే సాగుతున్నాయి. కానీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది ఇదమిద్దంగా తేలడంలేదు అని అంటున్నారు. జనసేనకు కనీసంగా నలభై నుంచి యాభై సీట్లు ఇవ్వాలన్నది జనసైనికుల డిమాండ్ గా ఉంది. ఆ విధంగా ఇస్తేనే పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే చాన్స్ ఉంటుందని కూడా వారు లెక్క వేస్తున్నారు.
ఆ సీట్లు కూడా జనసేనకు ఎక్కువ బలం ఉన్న ఉభయ గోదావరి ఉత్తరంధ్రా జిల్లాలలో ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఈ రెండు రీజియన్లలో మొత్త్తం కలుపుకుని 68 దాకా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో జనసేనకు కనీసంగా ఒక ముప్పై సీట్లు కోరబోతున్నారుట. మిగిలిన చోట్ల మరో పది నుంచి పదిహేస్ను సీట్లు తీసుకోబోతున్నారు అని అంటున్నారు.
అంటే మొత్తం మీద నలభై దాకా సీట్లు పొత్తులో జనసేన తీసుకుంటే అందులో కచ్చితంగా ముప్పయి పై దాటి సీట్లు జనసేన గెలుచుకుంటుందని ఆ మీదట టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకోవడానికి జనసేన డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.
అంటే కర్నాటక రాజకీయాల్లో జరిగినట్లుగా ఏపీలో జరుగుతుందని అంటున్నారు. అదేలా ఉంటే జనసేనకు నలభై సీట్లు ఇస్తే బీజేపీకి పది సీట్లు ఇస్తే టీడీపీ నికరంగా పోటీ చేసేది 125 సీట్లలోనే ఉంటుంది. అందులో వారికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు రావడం కష్టం అని అంచనా కడుతున్నారు. అదెలా అంటే 2014లో బీజేపీకి కేవలం 12 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇచ్చి 163 సీట్లకు టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీకి సొంతంగా వచ్చినవి 105 సీట్లు మాత్రమే.
ఇపుడు అంతకంటే తక్కువ సీట్లకు పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా నంబర్ గెలుచుకోవడం కష్టం అవుతుందని, అపుడు జనసేన సహకారం అవసరం అవుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆ విధంగా అనివార్య పరిస్థితి రాజకీయంగా ఏర్పడినపుడే జనసేన కూడా సీఎం పోస్టుకు డిమాండ్ చేసేందుకు వీలు అవుతుందని విశ్లేషిస్తున్నారు.
పవన్ కూడా ఇదే విషయాన్ని పలు సభలలో చెప్పిన దాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. సీఎం పదవి అన్నది ఎన్నికల అనంతరం తేలుతుందని, ముందు జనసేనను ఎక్కువ సంఖ్యలో గెలిపించాలని పవన్ కోరుతూ వస్తున్నారు. పవన్ మాటలలో అంతరార్ధాన్ని అర్ధం చేసుకున్న జనసేన నాయకులు తమ నాయకుడు సరైన వ్యూహమే రూపొందించారని అంటున్నారు.
అందుకే నారా లోకేష్ చంద్రబాబే సీఎం అని చెప్పినా జనసేన పర్టీ నేతలు పట్టించుకోవడంలేదు. నారా లోకేష్ అలా మాట్లాడడంలో తప్పు లేదని, ఆయన చంద్రబాబే సీఎం అంటారని, అదే తమ పార్టీ నేత అయిన నాగబాబుని ఈ విషయం మీద మీడియా ప్రశ్నిస్తే పవన్ సీఎం అనే చెబుతారు అని అంటున్నారు. ఇవన్నీ ఎన్నికల తరువాతనే తేలుతాయని జనసైనికులు అంటున్నారు.
అయితే ఎన్నికల తరువాత సీఎం ఎవరో తేలాల్సి ఉన్నా దానికి ప్రాతిపదిక మాత్రం ఎన్నికల ముందే జరుగుతుంది అని అంటున్నారు. అదెలా అంటే జనసేనకు ఇచ్చే సీట్లు అని అంటున్నారు. జనసేన నలభై కి తగ్గకుండా సీట్లు కోరాలనుకుంటోంది.
అవి కూడా తమకు బలమున్న సీట్లనే కోరుకుంటోంది. మరి ఆ సీట్లను టీడీపీ ఇచ్చినపుడు కచ్చితంగా జనసేన వ్యూహం పండుతుంది. కానీ టీడీపీ అలా చేస్తుందా అన్నదే ప్రధాన ప్రశ్న. సో జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చారు అన్నది కనుక ఒక్కసారి బయటకు వస్తే ఏపీ రాజకీయం పొత్తు రాజకీయం కూడా ఒక్కసారి చేంజి అయ్యే చాన్స్ కూడా ఉంది అని అంటున్నారు.