జనసేన క్యాండిడేట్స్ వీళ్లేనా?
ఇదే సమయంలో టీడీపీ – జనసేనలు కూడా ఎన్నికల రాజకీయాలు మొదలుపెట్టాయని తెలుస్తుంది!
By: Tupaki Desk | 13 Dec 2023 5:26 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ, టీడీపీ దూకుడు పెంచుతున్నాయి. ఈ సమయంలో పార్టీలో అంతర్గత ఇబ్బందులు తలెత్తకుండా సమస్య వచ్చిన ప్రతీ చోటా చకచకా పరిష్కారాన్ని చూపిస్తూ ముందుకుపోతున్నారు వైఎస్ జగన్. ఇదే సమయంలో సర్వేలూ, కేడర్, సమీకరణాల డిమాండ్ల మేరకు ఇన్ ఛార్జ్ లను కూడా మారుస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ – జనసేనలు కూడా ఎన్నికల రాజకీయాలు మొదలుపెట్టాయని తెలుస్తుంది!
అవును... తెలంగాణ ఎన్నికల అనంతరం టీడీపీ - జనసేనలు కూడా దూకుడు పెంచుతున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇరుపార్టీలకూ అతిపెద్ద సమస్యగా చెబుతున్న సీట్ల సర్ధుబాటు అంశంలో ఒక క్లారిటీకి వచ్చారనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికీ రెండేసి అసెంబ్లీ సీట్లు అనే డిమాండ్ ఉన్నప్పటికీ కాలక్రమేణా అది ఒక్కో పార్లమెంట్ స్థానానికీ ఒక్కో అసెంబ్లీ టిక్కెట్ అనేకాడికి వచ్చిందనే కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలో తాజాగా వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఆన్ లైన్ వేదికగా ఒక లిస్ట్ హల్ చల్ చేస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించారని, ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో పవన్ ఒక్కచోటే పోటీచేస్తున్నారని అంటున్నారు. దీంతో ఈ జాబితా ఇప్పుడు వైరల్ గా మారింది. పైగా... దాదాపు వాస్తవానికి అత్యంత దగ్గరగా ఈ జాబితా ఉందని అనిపిస్తుండటంతో... ఆల్ మోస్ట్ ఇదే ఫైనల్ అని అంటున్నారు పరిశీలకులు!
ఈ జాబితా ప్రకారం... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి గాజువాకను పక్కనపెట్టి భీమవరం నియోజకవర్గంలో మాత్రమే పోటీచేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ముందుగా తనకు తానే ప్రకటించుకున్నట్లుగానే నాదేండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయబోతున్నరని ఉంది. ఇదే సమయంలో నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీచేయబోతున్నారు!
ఇదే క్రమంలో జనసేనకు అత్యంత కీలకమైన స్థానాల్లో ప్రథమ స్థానంగా చెప్పుకునే రాజోలు నియోజకవర్గంలో తాజాగా హల్ చల్ చేస్తున్న జాబితా ప్రకారం... డీఎంఆర్ శేఖర్ పోటీ చేయబోతున్నారు. ఈయన గత ఎన్నికల్లో జనసేన నుంచి అమలాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేశారు.
తాజాగా హల్ చల్ చేస్తున్న జాబితా ప్రకారం... జనసేన అభ్యర్థులు - నియోజకవర్గాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నీలిమర్ల - లోకం నాగ మాధవి
గజపతినగరం - పడాల అరుణ
గాజువాక - సుందరపు సతీష్
భీమిలి - పంచకర్ల సందీప్
పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు
యలమంచిలి - సుందరపు విజయకుమార్
ముమ్మిడివరం - పితాని బాలకృష్ణ
రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్
కాకినాడ రూరల్ - పితాని నానాజీ
పిఠాపురం – ఉదయ్ శ్రీనివాస్
రామచంద్రాపురం - చిక్కం దొరబాబు
జగ్గంపేట - పటంశెట్టి సూర్యచంద్ర రావు
రాజోలు - డీఎంఆర్ శేఖర్
భీమవరం - కొణిదెల పవన్ కల్యాణ్
టనుకు - వీ రామచంద్ర రావు
తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
నరసాపురం - బొమ్మిడి నాయకర్
విజయవాడ వెస్ట్ - పోతిన మహేష్
తెనాలి - నాదెండ్ల మనోహర్
గిద్దలూరు - ఆమంచి శ్రీనివాస రావు