టీడీపీ నుంచి జనసేనకు ముష్టి వేస్తున్నారా!
కానీ చూడబోతే ఏపీలో టీడీపీ జనసేనల మధ్య పొత్తు ధర్మం కరెక్ట్ గా ఉందా అంటే జవాబు లేదు అనే వస్తోందిట.
By: Tupaki Desk | 13 Dec 2023 9:36 AM GMTతెలుగుదేశం ఒక పార్టీ జనసేన మరో పార్టీ. ఈ రెండు పార్టీలు మిత్రులుగా పోటీ చేయవచ్చు. పొత్తు కూడా కలపవచ్చు. కానీ సాటి పార్టీని గౌరవించడం పొత్తు పార్టీల ధర్మం. అదే రాజకీయ విధానం కూడా. కానీ చూడబోతే ఏపీలో టీడీపీ జనసేనల మధ్య పొత్తు ధర్మం కరెక్ట్ గా ఉందా అంటే జవాబు లేదు అనే వస్తోందిట.
దానికి కారణం టీడీపీ వైఖరి అని అంటున్నారు. జనసేనకు బలమైన సామాజిక నేపధ్యం కలిగిన బీభత్సమైన సినీ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. పైగా ఏపీలో యువత సైతం పవన్ వెంట ఉంది. అలాంటిది జనసేన టీడీపీతో పొత్తు కలిపింది. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. తప్పు కూడా కాదు, ప్రతీ రాజకీయ పార్టీకి కొన్ని వ్యూహాలు ఉంటాయి.
అలా జనసేన తనదైన వ్యూహంతో ఇలా చేసింది అనుకున్నా టీడీపీ అనుసరిస్తున్న తీరు మాత్రం జనసేనను బాధిసోంది అని అంటున్నారు. నిజానికి చూస్తే ముష్టి అన్న పదం పెద్ద పదం అయినా జనసేనలో మాత్రం అంతర్గతంగా అలాగే నేతలు అనుకుంటున్నారుట. దీని మీదనే టాక్ మొత్తం నడుస్తోందిట.
ఇక చూస్తే తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. మొత్తం ఎనిమిది సీట్లలో పోటీ చేస్తే ఏడు చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇక అక్కడ పోటీ చేసిన బర్రెలక్క కంటే కూడా హీనంగా జనసేన అభ్యర్ధులకు మిగిలిన ఏడు చోట్ల ఓట్లు రావడంతో సోషల్ మీడియాలో అది పెద్ద టాపిక్ అయింది. దాని మీద ట్రోలింగ్ కూడా ఒక్క లెక్కన సాగింది.
దీంతో పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అని టీడీపీలో కూడా చర్చ సాగింది అని అంటున్నారు. దీంతో టీడీపీ మైడ్ సెట్ మొత్తం మారిపోయింది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు గెలిచే సీట్లు అయిదారు మించి ఇవ్వకూడదని టీడీపీ భావిస్తోంది అని అంటున్నారు. దీని మీదనే ఇపుడు ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
అదే విధంగా టీడీపీ తాము ఎపుడూ గెలవనివి జనసేన కూడా గెలవలేని సీట్లు మరి కొన్ని ఇచ్చి మొత్తానికి పొత్తు సరి అనిపిస్తారని కూడా ప్రచారం అయితే గట్టిగానే సాగుతఒంది అని అంటున్నారు. ఇవన్నీ లెక్క కట్టి చూసుకున్నా పదిహేను మించి సీట్లు ఉంటాయా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట.
నిజానికి గోదావరి జిల్లాలలో జనసేనకు మంచి బలం ఉంది. ఆ తరువాత ఉత్తరాంధ్రాలో విశాఖలో పట్టు ఉంది. అక్కడా ఇక్కడా కలుపుకుని ఏకంగా నలభై సీట్ల దాకా జనసేనకు ఇస్తే తాము పోటీ చేసి పెద్ద నంబర్ గెలుచుకుని అసెంబ్లీకి వెళ్లవచ్చు అన్నది జనసేన ప్లాన్ అంటున్నారు. అయితే ఇదే జిల్లాలలో టీడీపీకి మంచి బలం ఉంది. గట్టి నాయకులు ఉన్నారు. అలాగే గెలిచే విధంగా కూడా చాన్స్ ఉంది.
దాంతో తమ అవకాశాలు వదులుకుని ఆ సీట్లు జనసేనకు ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనలో ఇపుడు టీడీపీ ఉంది అని ప్రచారంలో ఉన్న మాట. అంటే గెలిచే సీట్లుగా కొన్ని ఇచ్చి మిగిలినవి ఏ రాయలసీమలోనో ఎక్కువ నంబర్ ఇచ్చేసి జగన్ పోటీ చేస్తున్న పులివెందుల లాంటివి కూడా ఇందులో కలిపేస్తే పొత్తు పేరిట ఇచ్చినట్లుగా టీడీపీకి ఉంటుంది కనీ జనసేన గెలుపు అవకాశాలు పెద్దగా ఉండవని అంటున్నారు.
ఇలా అతి తెలివితో టీడీపీ ఆలోచిస్తోంది అని ప్రచారం సాగుతోంది. దీని మీద జనసేనలో తీవ్రంగానే మధనం జరుగుతోందిట. తమకు ముష్టిగా వేసినట్లుగా సీట్లు ఇస్తారా అన్నదే ఇపుడు ఆ పార్టీలో నడుస్తున్న టాక్ అని అంటున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో.