అమెరికాలో 2 చిన్న విమానాలు ఢీ.. మృతులు ఎంతమంది?
ఆరిజోనా రాష్ట్రంలో మరానా రీజినల్ ఎయిర్ పోర్టులో రెండు చిన్న విమానాలు గాల్లో ఢీ కొన్నాయి.
By: Tupaki Desk | 20 Feb 2025 4:56 AM GMTఅగ్రరాజ్యం అమెరికాకు ఏమైంది? గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో తరచూ విమాన ప్రమాదాలు అమెరికాలో చోటు చేసుకుంటున్నాయి. వరుస పెట్టి మరీ జరుగుతున్న ఈ ప్రమాదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా అలాంటిదే మరో ప్రమాదం చోటు చేసుకుంది.
ఆరిజోనా రాష్ట్రంలో మరానా రీజినల్ ఎయిర్ పోర్టులో రెండు చిన్న విమానాలు గాల్లో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లుగా చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే వీలుందని చెబుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం రన్ వే 12పై రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి.
ఇందులో ఒకటి సెస్నా 172ఎస్ కాగా రెండోది లాంకైర్ 360ఎంఎక్2. ఈ రెండు విమానాలు ఫిక్సెడ్ -వింగ్, సింగిల్ ఇంజిన్ విమానాలుగా జాతీయ రవాణా భద్రతా బోర్డు వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే.. ఈ ప్రమాదానికి కారణం ఏమిటి? మరణించిన వారు ఎందరు? లాంటి వివరాలు బయటకు రావాల్సి ఉంది.