Begin typing your search above and press return to search.

చరిత్ర సృష్టించిన తెలుగోడు.. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత మనోడే

తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆంద్రీకిన్ ద్మిత్రిపై విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 4:33 AM GMT
చరిత్ర సృష్టించిన తెలుగోడు.. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత మనోడే
X

అవును.. తెలుగుతేజం చరిత్రను సృష్టించాడు. ప్రపంచ చరిత్రలో అతి పిన్నవయసులోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేళి. చెస్ అన్నంతనే భారతీయులు ఎవరైనా విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకు వస్తారు. అలాంటి ఆయన తర్వాత ఇన్నాళ్లకు లైవ్ రేటింగ్స్ లో 2800 రేటింగ్ పాయింట్లను సాధించిన భారతీయుడిగా నిలిచాడు. ఆ మాటకు వస్తే.. ప్రపంచ చెస్ లో అర్జున్ కంటే మరో 15 మంది మాత్రమే ముందున్నారు. 21 ఏళ్ల పిన్న వయసులో యూరోపియన్ క్లబ్ చెస్ టోర్నీలో అల్కలాయిడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతగాడు.. అద్భుత ఫామ్ లో ఉన్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆంద్రీకిన్ ద్మిత్రిపై విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇటీవల చెస్ ఒలింపియాడ్ లో స్వర్ణం నెగ్గిన ఇతను..భారత చెస్ భవిష్యత్ ఆశాజ్యోతిగా మారాడు. ఇంతకు ఇతడు ఎక్కడివాడన్న విషయంలోకి వెళితే.. అర్జున్ వరంగల్ కు చెందినవాడు. దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న భారత చెస్ లో ఇన్నేళ్లుగా ఆనంద్ కు మాత్రమే సాధ్యమైన ఘనతను ఇప్పుడు ఈ కుర్రాడు సొంతం చేసుకున్నాడు. 2011 మార్చిలో విషీ అధ్యధికంగా 2817 రేటింగ్ అందుకున్నాడు. ఈ ఘనతను సాధించటం చాలాతక్కువ మందికే సాధ్యమైంది.

ఇతని కంటే ముందున్న చెస్ దిగ్గజాల్ని చూస్తే.. ఇతడు సాధించిన ఘనత ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

- గ్యారీ కాస్పరోవ్

- వ్లాదిమిర్ క్రిమ్నిక్

- అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా)

- కార్లసన్ (నార్వే)

- కరువానా

అరోనియన్

- వెస్లీ సో

- మికారు నకముర (అమెరికా)

ఈ దిగ్గజ ఆటగాళ్లంతా ‘ఎ’ రేటింగ్ సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన రికార్డును అందుకున్న పదహారో ఆటగాడిగా అర్జున్ నిలుస్తారు. అత్యధిక రేటింగ్ లో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్ సన్ ఉన్నారు. అతడికి 2831.0పాయింట్లు ఉండగా.. అమెరికాకు చెందిన కరువానాకు 2805.0 లైవ్ రేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో అర్జున్ ఇరిగేశి ఉన్నారు. ఇతను ఇప్పుడు 2802.1 పాయింట్లు ఉన్నారు. మరో 3 రేటింగ్ సాధిస్తే మరో మెట్టు ఎక్కే వీలుంది.

2022 చెస్ ఒలింపియాడ్ లో సభ్యుడిగా ఉన్న భారత జట్టుకు త్రుటిలో పతకం కోల్పోయింది. అయినా ఉత్తమ వ్యక్తిగత ప్రదర్శనకు రజతాన్ని సాధించారు. ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్ లో అర్జున్ కు తిరుగులేదు. పదకొండు గేమ్ లు ఆగిన అతను 9 విజయాన్ని సాధించటం గమనార్హం. మిగిలిన రెండు గేమ్ లను డ్రాగా ముగించాడు. భారత పురుషుల జట్టు ఒలింపియాడ్ లో తొలి స్వర్ణాన్ని గెలవటంలో అర్జున్ కీలకభూమిక పోషించారు. ఇప్పుడు అతని ముందున్న ఏకైక సవాల్.. ప్రపంచ ఛాంపియన్ కావటం. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న అతను ఇదే తీరును కంటిన్యూ చేస్తే.. ఆ అద్భుత విజయాన్నిసాధించటం అంత కష్టమైన పని కాదనే చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి.