రూ.200 కోసం పోలీస్ తో పోరాడిన ఆర్మీ మ్యాన్... వీడియో వైరల్!
ఈ క్రమంలో తాజాగా ఓ పోలీసుతో రూ.200 కోసం పోరాడిన ఆర్మీ మ్యాన్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 16 Feb 2025 7:30 AM GMTఅభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల గురించి చాలా మంది చాలా చెబుతారనే సంగతి తెలిసిందే. అయితే... వీటితో పాటు ప్రభుత్వ అధికారుల దోపిడీ కూడా ఒక కారణమని స్వీయానుభవం ఉన్నవారు నొక్కి చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోలీసుతో రూ.200 కోసం పోరాడిన ఆర్మీ మ్యాన్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అవును... నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు తమ ఆగ్రహాన్ని కామెంట్స్ సెక్షన్ లో చూపిస్తున్నారు. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలని చెబుతున్నారు. అదనపు డబ్బులు వసూలు చేస్తున్న పోలీసుపై పోరాడిన ఆర్మీ మ్యాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు ఏమి జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్...!
తాజాగా వైరల్ అవుతోన్న వీడియో... ఒక పోలీసు, ఒక ఆర్మీ మ్యాన్, ఒక పౌరుడికి మధ్య జరుగుతున్న పోరాటానికి సంబంధించినది. ఈ ఘటనలో రైలులోని ఓ పోలీసు.. ప్రయాణికుడి నుంచి రూ.200 అడిగాడు. దీంతో... ఆర్మీ మ్యాన్ రియాక్ట్ అయ్యారు. ఆ డబ్బులు ఇచ్చినందుకు ఆ వ్యక్తిని తిట్టడంతో పాటు పోలీసును ప్రశ్నించాడు.
ఈ సమయంలో... అదనపు డబ్బులు వసూల్ చేస్తున్న పోలీసుకు - ఆర్మీ మ్యాన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా... సదరు ఆర్మీ మ్యాన్ కు మద్దతుగా నిలబడుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఓ యూజర్... సదరు సైనికుడికి సెల్యూట్ అని చెబుతూ.. అలాంటి పోలీసులే ఈ సమాజానికి చీడ పురుగులు అని కామెంట్ చేయగా... ఈ తరహా వేదింపులకు ముగింపు ఎప్పుడో? అని మరొకరు స్పందించారు.