Begin typing your search above and press return to search.

"రేవంత్ రెడ్డిది నేరో మైండెడ్ థింకింగ్!"... సీరియస్ కామెంట్స్!

అల్లు అర్జున్ అరెస్ట్ విషయం సినిమా ఇండస్ట్రీలో కంటే రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   14 Dec 2024 6:30 AM GMT
రేవంత్ రెడ్డిది నేరో మైండెడ్ థింకింగ్!... సీరియస్ కామెంట్స్!
X

అల్లు అర్జున్ అరెస్ట్ విషయం సినిమా ఇండస్ట్రీలో కంటే రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చర్చ తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా రియాక్షన్ వచ్చినట్లు కనిపించలేదు కానీ... రాజకీయ నాయకుల నుంచి మాత్రం ఘాటైన రియాక్షన్ వచ్చిందనే చర్చ బలంగా నడిచింది.

ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్టును బీఆరెస్స్ నేతలు తీవ్రంగా ఘండించారు. ఈ వ్యవహారంపై కేటీఆర్, హరీష్ రావులు సర్కార్ పై ఫైరయ్యారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు బండి సంజయ్, రాజాసింగ్ లు ఖండించినంత పనిచేశారు! అయితే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాత్రం.. ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు కనిపించడం లేదన్నట్లు కామెంట్ చేశారని అంటున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్టును ఖండించారు. మరోపక్క నేషనల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సమయంలో అర్నబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు!

అవును... అల్లు అర్జున్ ను శుక్రవారం అరెస్టు చేసి జైలుకు పంపి.. సోమవారం సాయంత్రం వరకూ జైల్లో ఉంచాలని ఆలోచించారనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే! దీనిపై అర్నబ్ గోస్వామి స్పందించారు. ఈ సందర్భంగా... ఇలా ఆలోచించడం నేరో మైండెడ్ థింకింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా స్పందిస్తూ... అల్లు అర్జున్ ని శుక్రవారం అరెస్ట్ చేయడం వెనుక సీఎం రేవంత్ ప్లాన్ ఉందంటూ అర్నబ్ గోస్వామి ఆరోపించారు. శుక్రవారం అరెస్ట్ చేయడం వల్ల శని, ఆదివారల్లో బెయిల్ దొరికే చాన్స్ లేకుండా చేసి, సోమవారం సాయంత్రం వరకూ జైల్లో ఉంచాలనుకున్నారు అని ఆరోపించారు.

ఫలితంగా రేవంత్ రెడ్డి సూపర్ స్టార్ కావాలని భావించారని.. కానీ, ప్లాప్ యాక్టర్ అయ్యారని.. దీంతో.. అల్లు అర్జున్ సుపర్ సూపర్ స్టార్ అయ్యారని అర్నబ్ గోస్వామి అన్నారు. తనను ఉద్ధవ్ ఠాక్రే అరెస్ట్ చేసి ఆనందం పొందినట్లుగా అల్లు అర్జున్ ను వీకెండ్ అరెస్ట్ చేసి, సోమవారం సాయంత్రం వరకూ జైల్లోనే ఉంచాలనుకున్నారని అర్నబ్ గోస్వామి ఆరోపించారు.

ఈ క్రమంలోనే... ఇది పక్కా ప్లాన్ అని, ఇది నేరో మైండెడ్ థికింగ్ అంటూ అర్నబ్ గోస్వామి సంచలన కామెంట్స్ చేశారు!! ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి!