అంబానీ ఇంట పెళ్లిలో ఏపీ యువకులు అరెస్ట్!
అపరకుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహం ముంబైలో ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 July 2024 5:04 AM GMTఅపరకుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహం ముంబైలో ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల వేడుక ప్రపంచ వివాహ చరిత్రలోనే నిలిచియేలా ఎంతో వైభవంగా నిర్వహించారు. 100 ఏళ్లలో ఇలాంటి పెళ్లి జరిగి ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత గొప్ప గా పెళ్లి చేయడం అన్నది అంబానీకి మాత్రమే చెల్లిందని కోట్లాది మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ఆ సంగతి పక్కనబెడితే ఈ పెళ్లికి ఆహ్వానం లేకుండా హాజరైన ఇద్దరు యువకుల్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు ఆంద్రప్రదేశ్ కి చెందిన వారు కావడం గమనార్హం. ఒకరు యూ ట్యూబర్ వెంకటేష్ అల్లూరి..మరొకరు వ్యాపార వేత్తగా చెప్పుకుంటోన్న షపీ షేక్ గా పోలీసులు గుర్తించారు. వారిద్దరిని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి వదిలేసారు. అయినా ఇద్దరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
ప్రపంచ కుబేరులు, సెలబ్రిటీలు, రాష్ట్రాల సీఎంలు, తలపండిన రాజకీయ నాయకులు ఇలా ఎంతో మంది వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే. వాళ్లందర్ని చూసేందుకు..అంబానీ ఇంట ఏర్పాటు చేసిన అతిధ్యం అందుకునేందుకు యువకులిద్దరు భావించి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు నిఘా ఉండటంతో వాళ్లిద్దరిపై సందేహం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మధ్యనే ఆహ్వానం లేకుండా వివాహాలకు, వేడుకలకు వెళ్తే ఆరెస్ట్ చేసి విచారించాలని కొత్తగా ఓ చట్టం కూడా అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అనుమానం వచ్చిన వారిపై నిర్వాహకులు ఫిర్యాదు చేస్తే పోలీసులొచ్చి అదుపులోకి తీసుకుని స్టేసన్ కి తరలిస్తున్నారు. అపై విచారణ జరుగుతుంది. అంబానీ ఇంట పెళ్లి లో దొరికిన ఇద్దరు యువకులపై తదుపరి విచారణ ఉంటుందని తెలుస్తోంది.