Begin typing your search above and press return to search.

ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ ఆత్మహత్య

లగాన్ జోదా అక్బర్‌ లాంటి అద్భుతమైన పీరియాడిక్‌ మరియు ఛారిత్రాత్మక సినిమాలకు అద్భుతమైన ఆర్ట్‌ వర్క్ ను అందించిన ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్‌

By:  Tupaki Desk   |   2 Aug 2023 9:21 AM GMT
ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ ఆత్మహత్య
X

సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఈ మధ్య కాలంలో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా మృతి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు విషాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఏదో విభాగంకు చెందిన ప్రముఖులు మృతి చెందుతున్న ఈ సమయంలో ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.

లగాన్, జోదా అక్బర్‌ లాంటి అద్భుతమైన పీరియాడిక్‌ మరియు ఛారిత్రాత్మక సినిమాలకు అద్భుతమైన ఆర్ట్‌ వర్క్ ను అందించిన ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్‌ గురించి బాలీవుడ్ వర్గాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో సుపరిచితుడు గా పేరు దక్కించుకున్న నితిన్ దేశాయ్ మృతి చెందారు.

తన ఆర్ట్‌ స్టూడియోలోనే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. స్టూడియోకు పోలీసులు చేరుకుని పంచనామా చేసినట్లుగా కూడా బాలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన మృతికి గల కారణాలు ఏంటి అనేది తెలియరాలేదు.

నితిన్‌ దేశాయ్ మృతి తో బాలీవుడ్ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థించారు. ఆయన అందించిన ఆర్ట్‌ వర్క్‌ ను ఎప్పటికి మర్చిపోలేమని.. ఆయనతో అనుబంధాన్ని ఎప్పటికీ మర్చి పోలేమని పలువురు కామెంట్స్ చేశారు.