షాకింగ్ న్యూస్... చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్!
టెక్నాలజీ సంచలనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Nov 2023 3:15 AM GMTటెక్నాలజీ సంచలనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏఐ వల్ల ప్రధానంగా ఉద్యోగాలు పోతాయని, ఆ విషయంలో ఊహించని స్థాయిలో సమస్యలు వస్తాయని పలువురు నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన మరో కార్యక్రమం తెరపైకి వచ్చింది. ఇది చట్టవిరుద్ధంగా జరిగిందనే కామెంట్లు వినిపిస్తుండటంతో ఏఐపై మరోసారి చర్చ మొదలైంది.
ఈ క్రమంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచ ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... పనిలో ఉత్పాదకతను పెంపొందించుకోవడం దగ్గర నుంచి ఆదాయ సముపార్జన వరకు ఇదొక మార్గంగా నిలిచిందనే చెప్పుకోవాలి. అయితే జీపీటీ-4 ఆధారిత ఏఐని ఉపయోగించి స్టాక్ మార్కెట్ లో చట్టవిరుద్ధంగా లాభపడవచ్చనే నివేదికలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
అవును... ఓపెన్ ఏఐ విప్లవాత్మక మోడల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ సమాజం కృత్రిమ మేధస్సుని చూసే విధానంలో భారీ మార్పు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఈ తరహా సాంకేతికత వల్ల పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ అదేస్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ సమయంలో ఏఐ ద్వారా వస్తాయని ఇంతకాలం చెప్పుకున్న సమస్యలతోపాటు ఇప్పుడు తాజాగా సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా స్టాక్ మార్కెట్ లో చట్టవిరుద్ధంగా లాభపడొచ్చనే చర్చ మొదలైంది. తాజాగా యునైటెడ్ కింగ్ డం నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ లో.. ఈ సాంకేతికత ఉపయోగించి చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని తేలింది. ఇదే సమంలో అలా చేసిన చట్టవిరుద్దమైన పనులను తర్వాత తెలివిగా కప్పి పుచ్చుకోగలదని కూడా వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది.
ఈ డెమోలో సంస్థకు తెలియకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోట్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం నకిలీ సమాచారాన్ని వినియోగించినట్లు బయటపడింది. ఈ విషయాలపై స్థానిక ఫ్రాంటియర్ ఏఐ టాస్క్ ఫోర్స్ దీనికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ ఆర్గనైజేషన్... అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ద్వారా జరిగే నష్టాలను అంచనా వేస్తుంటుంది.
ఈ క్రమంలో తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతా విభాగంలో పనిచేసే అపోలో రీసెర్చ్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ సందర్భంగా తన పరిశోధన ఫలితాలను ఏపెన్ ఏఐతో పంచుకుంది. ఇందులో భాగంగా స్వయంప్రతిపత్తి, సామర్థ్యం కలిగిన ఏఐలు మైషి జోక్యాన్ని అధిగమించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో చట్టవిరుద్దమైన పనులు చేసి, సులువుగా తప్పించుకునే ప్రమాదం కూడా ఉందని తెలిపింది.