Begin typing your search above and press return to search.

వార్ వన్ సైడ్!... అరుణాచల్ లో బీజేపీ హవా!

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది

By:  Tupaki Desk   |   2 Jun 2024 6:00 AM GMT
వార్ వన్ సైడ్!... అరుణాచల్ లో బీజేపీ హవా!
X

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ లో 133 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం నేడు తేలుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు అక్కడ మరోసారి కమళం వికసించిందని తెలుస్తుంది.

అవును... శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని మెజారిటీ సంస్థలు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఉత్సాహంలో ఉన్న కమళనాథులకు మరో ఎగ్జాట్ గుడ్ న్యూస్ చెబుతుంది అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని తెలుస్తుంది.

ఏప్రిల్ 19న జరిగిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 82.71శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో.. ఈ స్థాయిలో జనం పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లు కట్టారంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చేప్పే విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో ఈసారి బీజేపీకి కష్టాలు తప్పవనే కామెంట్లూ వినిపించాయి.

అయితే తాజాగా వెలువడుతున్న ఎగ్జాట్ ఫలితాలు మాత్రం... బీజేపీ గెలుపును కన్ఫాం చేస్తున్నాయి. ఇందులో భాగంగా... అరుణాచల్ ప్రదేశ్ లో పోలింగ్ జరిగిన 50 స్థానాలకు గానూ 30కి పైగా స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉందని ఫలితాలు వస్తున్నాయి. ఇక మిగిలిన వాటిలో నేషనల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ ఒక్క చోటా ఆధిక్యంలో ఉన్నాయని తెలుస్తుంది.

దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో మరోమారు కమళవికాసమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా... అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నప్పటికీ 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. దీంతో... ఆ పదికి తోడు ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న 30 స్థానాలు కలిస్తే... భారీ మెజారిటీ కన్ఫాం అని అంటున్నారు!