Begin typing your search above and press return to search.

హరియాణా లాగా ఢిల్లీలోనూ కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన ఆప్!

అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సొంత బలంతోనే ముందుకువెళ్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

By:  Tupaki Desk   |   11 Dec 2024 8:17 AM GMT
హరియాణా లాగా ఢిల్లీలోనూ కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన ఆప్!
X

పొత్తు లేదు పై ఎత్తే అన్నట్లుగా ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ ముందుకుసాగుతోంది. దేశ రాజధానిలో మరొక్క రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ ను నిందిస్తున్న ఇండియా కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా జలక్ ఇస్తుండగా వాటి సరసన చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కథ వేరుగా ఉండేది. ఎందుకంటే ఢిల్లీలో రెండు దఫాలుగా (పదేళ్లు) అధికారం కోసం ప్రయత్నించి విఫలమైంది బీజేపీ. అది కూడా ఆప్ వంటి పార్టీ చేతిలో పరాజయం పాలైంది. మహారాష్ట్ర, యూపీ వంటి పెద్ద రాష్ట్రాలను అలకోవగా గెలుచుకున్న కాషాయ పార్టీకి పరువు తక్కువగా మారింది. అందుకనే ఈసారి ఎలాగైనా ఢిల్లీని చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఒకవేళ కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే అది సాధ్యం కాకపోయేది. కానీ, ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరి దశకు వచ్చి మరీ ముందకెళ్లలేదు.

హరియాణాలో హ్యాండిచ్చి ఢిల్లీ పొరుగునే ఉంటుంది హరియాణా. ఇక్కడ రెండు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు ఆప్ తొలుత సిద్ధమైంది. కానీ, చివరకు ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ వచ్చే సమయానికి హ్యాండిచ్చారు. దీంతో రెండు పార్టీలు ఒంటరిగానే బరిలో దిగాయి. చివరకు హరియాణాను బీజేపీ ఎగరేసుకుపోయింది.

ట్వీట్ తో చెప్పేశారు..

అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సొంత బలంతోనే ముందుకువెళ్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ కు 15 స్థానాలు కేటాయించేందుకు ఆప్ సిద్ధమైందనే కథనాలు వచ్చాయి. 1 లేదా 2 స్థానాలు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ, కాంగ్రెస్ కు హ్యాండిచ్చేశారు. ఇప్పటికే ఆప్ తొలి జాబితాను వెల్లడించింది. తాజాగా రెండో విడతనూ ప్రకటించింది. మొత్తం 31 మందికి టికెట్లు ఇచ్చింది.

కొసమెరుపు: ఢిల్లీలో 1998 నుంచి 2014 వరకు దాదాపు 15 ఏళ్లు అధికారంలో ఉంది కాంగ్రెస్. అలాంటి పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఆప్ తో బేరాలు ఆడుకునే స్థితికి వచ్చింది. పైగా ఢిల్లీ పొరుగునే ఉండే హరియాణాలో ఈ రెండు పార్టీలు మొన్న తలపడ్డాయి. మరో పొరుగు రాష్ట్రం పంజాబ్ లో కాంగ్రెస్ సర్కారును కూలదోసింది ఆప్.