Begin typing your search above and press return to search.

కేజ్రీ క్రేజ్ ఇంతింతై : బీజేపీ ఆప్ సోపాలు !

ఆప్ అన్న పార్టీ 2012లో ఏర్పాటు అయింది. ఆ మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకుంది

By:  Tupaki Desk   |   25 May 2024 3:54 AM GMT
కేజ్రీ క్రేజ్ ఇంతింతై  : బీజేపీ ఆప్ సోపాలు !
X

ఆప్ అన్న పార్టీ 2012లో ఏర్పాటు అయింది. ఆ మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకుంది. అయితే తగినంత మెజారిటీ దక్కలేదు. . ఈ ఎన్నికలలో పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ బయటి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తరువాత కూలిపోయింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది.

ఇక 2020లో మరోసారి ఆప్ గెలిచి మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉంటే పార్టీ పెట్టిన పదేళ్ళ కాలంలోనే ఆప్ కి కేంద్ర ఎన్నికల సంఘం 2023 ఏప్రిల్ 9న ఆమ్ జాతీయ పార్టీ హోదాను ప్రకటించింది. ఇల ఆప్ ప్రభావంతో పంజాబ్ లో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. గుజరాత్ లో తొలిసారి పోటీ చేసి ఏడున్నర శాతం ఓట్లు సాధించింది. యూపీ సహా చాలా చోట్ల ఆప్ సత్తా చాటుతోంది.

ఈ నేపధ్యంలో ఆప్ తో ఎలా అన్నది బీజేపీకి అర్ధం కావడం లేదు అంటున్నారు. కాంగ్రెస్ ని అయితే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా కుటుంబ పార్టీగా గాంధీ ఫ్యామిలీ అంటూ విమర్శించవచ్చు. జనాలు కూడా ఆ పార్టీ మీద విమర్శలు చేస్తే అవి నిజమైతే యాక్సెప్ట్ చేస్తారు. కాంగ్రెస్ సుదీర్ఘ కాలం అధికారంలో ఉంది కాబట్టి తప్పులు జరుగుతాయి. వాటిని ఎత్తి చూపుతూ బీజేపీ తన రాజకీయ దూకుడుని కొనసాగించే వీలుంది.

మరో వైపు చూస్తే కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గింది. ఎస్పీ లాంటివి అన్నీ ప్రాంతీయ పార్టీలే. అయితే ఆప్ తో మాత్రం బీజేపీకి ప్రమాదం ముంచుకొస్తోంది. ఏకంగా బీజేపీ ప్రముఖులు అంతా ఉన్న చోటనే ఢిల్లీలో ఆప్ జెండా పాతేసింది. బీజేపీకి పూర్వ రూపం జనసంఘ్ కాలం నుంచి ఢిల్లీలో పట్టుంది. ఇప్పటికి పాతికేళ్ళ క్రితం ఢిల్లీ పీఠం ఎక్కింది బీజేపీ నాటి నుంచి నేటి వరకూ మళ్ళీ ముచ్చట తీరలేదు.

ఇక ఆప్ ని ఎలా డీల్ చేయాలో బీజేపీకి తెలియడం లేదు అని అంటున్నారు. దాంతోనే ఆప్ సోపాలు పడుతోంది అని అంటున్నారు. ఆప్ ని ఒక విధంగా పెను భూతంగా చూస్తూ పెంచి పోషించింది కూడా బీజేపీ అని అంటారు. ఆప్ కి కాంగ్రెస్ బీజేపీ రెండూ ప్రత్యర్ధులే. అలా డిసైడ్ అయి అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయం మొదలెట్టారు. అలాంటి ఆప్ ని బీజేపీ టార్గెట్ చేయడంతోనే ఆయన కాంగ్రెస్ తో జట్టు కట్టాల్సి వచ్చింది అని అంటున్నారు. దాని మూల్యన్ని బీజేపీ ఢిల్లీతోనే చెల్లించబోతోంది అని అంటున్నారు. అలాగే బీజేపీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ చిల్లు పడే సీన్ కళ్ళ ముందే ఉంది అని అంటున్నారు.

కేజ్రీవాల్ ని జైలులో పెట్టడం లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేయడం వంటి వాటి వల్ల బీజేపీకి ఏమి ఒరిగిందో తెలియదు కానీ ఆప్ అధినేత మాత్రం జనంలో ముఖ్యంగా ఉత్తర భారతాన క్రేజ్ బాగానే సంపాదించుకున్నారు అని అంటున్నారు. దానికి గానూ ఆయన కమలానికి థాంక్స్ చెప్పుకుని తీరాల్సిందే అంటున్నారు. నేను ప్రధాని పదవిని పోటీ దారుణ్ణి కాను అని కేజ్రీ అంటున్నా బీజేపీ టార్గెట్ తో ఇంతింతై ఎదుగుతున్న ఆయన ఏదో నాటికి కేంద్రానికే గురి పెట్టడం ఖాయమని అంటున్నారు. రాజకీయాలో కొన్ని డెసిషన్స్ బూమరాంగ్ అవుతూ ఉంటాయి. కేజ్రీ విషయంలో బీజేపీ కొత్త వ్యూహాలు అనుసరిస్తే బాగుంటుందేమో అంటున్నారు.