Begin typing your search above and press return to search.

"శ్రీరాముడు ఈ కాలంలో జ‌న్మించి ఉంటే.. బీజేపీలో చేరేవారు''

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స‌హా బీజేపీపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పించే ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ వేదిక‌గా సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు

By:  Tupaki Desk   |   9 March 2024 5:39 PM GMT
శ్రీరాముడు ఈ కాలంలో జ‌న్మించి ఉంటే.. బీజేపీలో చేరేవారు
X

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స‌హా బీజేపీపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పించే ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ వేదిక‌గా సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. ''ఈ యుగంలో శ్రీరాముడు జ‌న్మించి ఉంటే ఆయ‌న ఇంటికి కూడా కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం ఈడీ, సీబీఐ లను పంపించి ఉండేవారు'' అని అన్నారు. అంతేకాదు.. ''బీజేపీలో చేర‌తావా? ఛ‌స్తావా? అని పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి ఒత్తిడి చేసేవారు'' అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన బ‌డ్జెట్‌పై చర్చ‌లో మాట్లాడుతూ.. అర‌వింద్ కేజ్రీవాల్ ఈ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

''ఈరోజు మనమంతా బడ్జెట్‌పై చర్చిస్తున్నాం. ఈ సమయంలో నా చిన్న తమ్ముడు మనీష్ సిసోడియా గుర్తుకొస్తున్నారు. ఆప్ ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పిస్తున్న 10వ బడ్జెట్ ఇది. గత 9 బడ్జెట్‌లు సిసోడియా ప్రవేశపెట్టారని, ఇదే అసెంబ్లీలో 11వ బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెడతారనే ఆశాభావంతో ఎదురు చూశాను. కానీ, సాధ్యం కాలేదు'' అని కేజ్రీవాల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణం.. ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలో చేరాల‌ని త‌నపై ఒత్తిడి తెచ్చార‌ని, కానీ,, తాను కంఠంలో ప్రాణం ఉండ‌గా ఆప‌నిమాత్రం చేసేది లేద‌ని తేల్చి చెప్పాన‌ని అన్నారు. అందుకే పార్టీ నేత‌లు, మంత్రుల‌ను టార్గెట్ చేసుకుని దాడులు చేయించి అరెస్టు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

''విపక్ష నేతలపై బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోంది. శ్రీరాముడే ఈ యుగంలో పుట్టి ఉంటే, ఆయన ఇంటికి ఈడీ-సీబీఐలను బీజేపీ పంపి ఉండేది. ఆయన తలకు తుపాకీ గురిపెట్టి బీజేపీలో చేరుతావా, జైలుకు వెళ్తావా? అని అడిగి ఉండేది. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కుప్పకూలుస్తోంది. మనీ, అధికారిక‌ పవర్‌తో ఈ పని చేస్తోంది. మెహల్లా క్లినిక్‌ల నిర్మాణాలను నిలిపివేసే ప్రయత్నాలను బీజేపీ చేస్తోంది. ఢిల్లీ ప్రజలకు నేను ప్రేమను పంచి వారి ప్రేమను పొందుతున్నా. ఢిల్లీకి శత్రువులెవరో అంతా అర్ధం చేసుకోవాలి. బీజేపీ వారిని శాశ్వతంగా ఢిల్లీ నుంచి పారద్రోలడంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తాం'' అని కేజ్రీవాల్ అన్నారు.