Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి నివాసం నుంచి అశోక్ మిట్టల్ ఇంటికి.. క్రేజీవాల్ జర్నీ..

ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయడానికి నిర్ణయించుకున్నారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 1:03 PM GMT
ముఖ్యమంత్రి నివాసం నుంచి అశోక్ మిట్టల్ ఇంటికి.. క్రేజీవాల్ జర్నీ..
X

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ ఈరోజు సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. సివిల్ లైన్స్ ఏరియాలోని 6 ఫ్లాగ్ఫ్ రోడ్ లో ఉన్న సీఎం నివాసం నుంచి ఆయన తన కుటుంబంతో కలిసి శుక్రవారం నాడు బయటకు వచ్చేశారు. ఇటీవల క్రేజీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయడానికి నిర్ణయించుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని ఒక బంగ్లా ఇకపై ఆయన నివాసం కాబోతోంది. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకి కూడా వెళ్లి వచ్చిన క్రేజీవాల్.. పీఎం పదవికి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో అతిశీకు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

సీఎం పదవి నుంచి తప్పుకోవడంతో త్వరలో తాను సీఎం నివాసాన్ని ఖాళీ చేయబోతున్నట్లు ఇటీవల పార్టీ కార్యకర్తలకు కేజీవాల్ వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పలువురు చట్ట సభ్యులు, కార్యకర్తలు కేజీవాల్ తమతో తమ ఇంటికి వచ్చి ఉండాలి అని విన్నవించుకున్నారు. 2013లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిలక్ లైన్లో క్రేజీవాల్ నివసించేవారు. 2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత

ఫ్లాగ్ఫ్ రోడ్డులోని ఇంటికి మారారు.

డిఫెన్స్ కాలనీ,పితంపురా, జోర్ బాగ్, చాణక్యపురి, గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్ లాంటి ఎన్నో ప్రాంతాలలో క్రేజీవాల్ కు వసతి కల్పిస్తామని వివిధ సామాజిక, రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. అయితే తన అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలను కలిసే వసతి ఉండే విధంగా ఉంటుంది కాబట్టి క్రేజీవాల్ అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు.

ప్రస్తుతం ఆయన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. రాజకీయాలలోకి రాకముందు ఆయన ఉత్తరప్రదేశ్ ,ఘజియాబాద్ లోని కౌశాంబిలో ఉండేవారు.

అయితే ప్రస్తుతం జాతీయ పార్టీ అధినేత పదవిలో ఉన్నందుకు ఆయనకు అధికారికంగా నివాసం కల్పించాలి అంటూ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది. మరి ఈ విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.