Begin typing your search above and press return to search.

54+ 47+ 11+ 7 ...ఇదీ తెలంగాణా స్కోర్ అంట...!

తెలంగాణాలో ఎన్నికల సంగ్రామం జోరందుకుంది. అటూ ఇటూ అంతా మోహరించి ఉన్నారు. ఈసారి ఆరు నూరు అయినా గెలిచి తీరాలని పట్టుదలా అందరిలో కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:50 AM GMT
54+ 47+ 11+ 7 ...ఇదీ తెలంగాణా స్కోర్ అంట...!
X

తెలంగాణాలో ఎన్నికల సంగ్రామం జోరందుకుంది. అటూ ఇటూ అంతా మోహరించి ఉన్నారు. ఈసారి ఆరు నూరు అయినా గెలిచి తీరాలని పట్టుదలా అందరిలో కనిపిస్తోంది. సరే రాజకీయ పార్టీలు అన్న తరువాత వారికి ఆశలు ఉంటాయి. అలాగే ఆరాటాలు ఉంటాయి. ఎల్లకాలం తామే అధికారంలో ఉండాలని ఉంటుంది. కానీ జనాలు ఎలా ఉన్నారు. వారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో రియాల్టీస్ ఎలా ఉన్నాయంటే అనేక రకాలైన సర్వేలు వెలువడుతున్నాయి.

అదే టైం లో చూసుకుంటే చాలా సర్వేలు వస్తున్నాయి. అందుకో ఇటీవల ఒక ప్రైవేట్ సర్వే తెలంగాణాలో చేస్తే వచ్చిన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి అని అంటున్నారు. ఆ సర్వే ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ కి 54 సీట్లు, బీయారెస్ కి 47 సీట్లు, ఎం ఐ ఎం 7 సీట్లు తెచ్చుకుంటాయని ఈ సర్వే ఒక కచ్చితమైన లెక్క వేసి మరీ బయటపెట్టింది అని అంటున్నారు.

దీన్ని బట్టి చూస్తే తెలంగాణాలో ఈసారి హంగ్ అసెంబ్లీ వస్తుంది అని అంటున్నారు. ఎవరికీ ఫుల్ మెజారిటీ రాదు అని కూడా ఈ సర్వేను బట్టి తెలుస్తోంది అని అంటున్నారు. దీంతో ఎవరు ఎవరితో కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. బీయారెస్ కి వచ్చే 47 సీట్లు, బీజేపీకి వచ్చే 11 సీట్లు కలుపుకుంటె 58 సీట్లు అవుతాయి. సింపుల్ మెజారిటీ రావాలంటే 60 సీట్లు తెచ్చుకోవాలి. అంటే అక్కడికి రెండు సీట్లు తగ్గుతాయి అన్న మాట.

అయితే బీయారెస్ కి ఈ రోజుకీ ఫుల్ సపోర్ట్ చేస్తూ గట్టి మద్దతుదారుగా ఉన్న మజ్లీస్ పార్టీ బీజేపీ బీయారెస్ తో కలిస్తే తాను దూరంగా ఉంటుంది తప్ప మద్దతు ఇవ్వదని అంటున్నారు. ఇక బీయారెస్ మజ్లీస్ పార్టీ కలిస్తే 54 సీట్లు అయిన కాంగ్రెస్ తో సరిసమానం అవుతాయి తప్ప అక్కడికీ మెజారిటీ రావడానికి ఆరు సీట్లు తక్కువ పడతాయని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ బీయారెస్ జట్టు కట్టే ప్రసక్తి అంతకంటే ఉండదు. ఈ రెండు పార్టీలే ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అధికారం కోసం గట్టిగా ముందుకు దూకుతున్నారు. దాంతో బీజేపీ అయితే అసలు కలవదు, ఇక మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ తో కలుస్తుందా అంటే ఆ సూచనలు అయితే ఏమీ లేవు. మరి ఎలా కొత్త ప్రభుత్వం ఈ రకమైన నంబర్లతో ఏర్పాటు అవుతుంది అన్నది పెద్ద చర్చగా ఉంది.

ఇక్కడ రాజకీయంగా తమాషా జరిగే సీన్ ఉంది. బీజేపీ సింగిల్ డిజిట్ ని దాటి డబుల్ డిజిట్ గా మారే ప్రయత్నం ముమ్మరంగా చేస్తోంది. అది ఎంతలా ప్రయత్నం చేస్తే అంతలా హంగ్ అసెంబ్లీకి కారణం అవుతుంది. కాంగ్రెస్ కి మెజారిటీ కూడా రాకుండా సీట్లు తగ్గిపోతాయి. అందువల్ల కాంగ్రెస్ బీజేపీ మీద ఫోకస్ పెట్టి బీజేపీకి ఎక్కువ సీట్లు రాకుండా తనదైన వ్యూహరచన చేస్తుంది అని అంటున్నారు.

అయితే ఈ సర్వేలు ఎంతో కొంత ప్రజాభిప్రాయాన్ని బయటపెడుతున్నాయి కాబట్టి బీజెపీ ఎంత ఎదిగితే అంతలా కాంగ్రెస్ తగ్గుతుంది అన్న సంకేతాలు ఉన్న నేపధ్యంలో కేసీయార్ మాత్రం బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలనే కోరుకుంటున్నారు అని అంటున్నారు. ఇలా బీయారెస్ కాంగ్రెస్ బీజేపీ విషయంలో తమదైన స్ట్రాటజీతో ఇక మీదట మరింత జోరు చేస్తారని అంటున్నారు.

మరో వైపు చూస్తే హంగ్ అసెంబ్లీ కనుక వస్తే ప్రతీ ఎమ్మెల్యేకూ డిమాండ్ వేరే లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యే జాక్ పాట్ కొట్టినట్లే అంటున్నారు ఎమ్మెల్యే రేట్ కూడా బాగా పలుకుతుంది అని అంటున్నారు. దీంతో ఈసారి పోటీకి నిలబడుతున్న ఎమ్మెల్యేలు అంతా కూడా లక్కీ స్టార్స్ అయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

ఇప్పటికి కొద్ది రోజుల ముందే బీజేపీ కీలక నేత సంతోష్ తెలంగాణాలో హంగ్ వస్తుంది అని చెప్పి ఉన్నారు. బహుశా ఆయన జోస్యాలు నిజం అవుతాయా అన్నదే చర్చగా ఉంది. హోరా హోరీ పోరూ తక్కువ సీట్లు ఉండడం, త్రిముఖ పోటీ వంటివి హంగ్ కి కచ్చితంగా దారి తీస్తాయని అంటున్నారు. గతంలో అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు కూడా అదే చాటి చెబుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.