భూమిని ఢీకొట్టిన గ్రహశకలం... వీడియో వైరల్!
ఓ గ్రహశకలం భూమిని ఢీకొంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు.. అది గ్రహశకలం సైజు, అది పడే ప్రాంతంపై ఆధారపడి ఉంటుందని అంటారు.
By: Tupaki Desk | 4 Dec 2024 4:55 AM GMTఓ గ్రహశకలం భూమిని ఢీకొంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు.. అది గ్రహశకలం సైజు, అది పడే ప్రాంతంపై ఆధారపడి ఉంటుందని అంటారు. వీటిపై నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెగ్యులర్ గా ప్రపంచానికి సమాచారం ఇస్తుంటుంది. ఈ క్రమంలో... ఓ గ్రహ శకలం భూమిని ఢీకొట్టబోతోందని గుర్తించిన 12 గంటల్లోనే.. అన్నంత పని చేయడం గమనార్హం.
అవును... తాజాగా ఓ గ్రహశకలం భూమిని ఢీకొటీంది. సుమారు 70 సెంటీ మీటర్ల వ్యాసం కలిగిన ఓ గ్రహశకం గుర్తించబడిన కొన్ని గంటల్లోనే భూమిని ఢీకొట్టింది. ఇందులో భాగంగా... డిసెంబర్ 3 - 2024న రష్యాలోని యాకుటియాపై పడింది. ఈ సమయంలో అద్భుతమైన ఫైర్ బాల్ ను సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
గతంలో భూమివైపు వచ్చిన కొన్ని గ్రహశకలాలను పోలి ఈ గ్రహశకలం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... 2022 డబ్ల్యూజే, 2023 సీఎక్స్ 1, 2024 బీఎక్స్ 1 లను పోలి ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం ప్రభావాన్ని అద్భుతమైన ఖచ్చితత్వంతో +/- 10 సెకన్ల లోపు విజయవంతంగా అంచనా వేశారు.
ఈ గ్రహశకలం భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అనేక శకలాలుగా విడిపోయి.. మారుమూల అటవీప్రాంతంలో చిన్న చిన్న రాళ్లను వెదజల్లింది. అయితే... అదృష్టవశాత్తు దీని పరిమాణం, అది పడిన ప్రాంతం కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. గణనీయమైన నష్టం ఏమీ సంభవించలేదని అంటున్నారు.