సంచలనం : 12 జూలై 2038... టెన్షన్ న్యూస్ చెప్పిన నాసా!!
అనంతరం తాజాగా జూన్ 20న మేరీల్యాండ్ లోని లారెల్ లోని జాన్స్ హోప్ కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీలో చేసిన పరిశోధనల్లో గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందనే ఊహాత్మక అంశంపై అభ్యాసనం చేసింది.
By: Tupaki Desk | 25 Jun 2024 3:56 AM GMTసాధారణంగా వేలాది గ్రహశకలాలు భూకక్ష్యలోని వస్తుంటాయి. అయితే అవి భూకక్ష్యలోని ప్రవేశించగానే విపరీతమైన ఒత్తిడి నెలకొని ముక్కలుగా అయిపోవడం.. కాలు బూడిదై వాతావరణంలో కలిసిపోవడం జరుగుతుంటాయి. వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈసారి మాత్రం ఒక గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం 72% ఉందని నాసా అంచనా వేసింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... 12 జూలై 2038 (14.25 సంవత్సరాల వ్యవధి) న ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆ గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తే ఏమి చేయాలన్న అంశంపై ఒక సమావేశం నిర్వహించింది. తాజాగా దానికి సంబందించిన ఓ నివేదికను విడుదల చేసింది. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించినట్లు వెల్లడించింది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐదో ద్వైవార్షిక ప్లానెటరీ డిఫెన్స్ ఇంటర్ ఏజన్సీ టాబ్లెట్ టాప్ పరిశోధనలను ఏప్రిల్ లో నిర్వహించింది. అనంతరం తాజాగా జూన్ 20న మేరీల్యాండ్ లోని లారెల్ లోని జాన్స్ హోప్ కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీలో చేసిన పరిశోధనల్లో గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందనే ఊహాత్మక అంశంపై అభ్యాసనం చేసింది.
ఈ పరిశోధనలో నాసాతో పాటు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలు, అంతర్జాతీయంగా నాసాకు సహకారం అందిస్తున్న పలువురు ప్రతినిధులు పాల్గొన్నారని సంస్థ వెల్లడించింది. అయితే ఆ గ్రహశకలం పరిమాణం, దీర్ఘకాలిక పథాన్ని కచ్చితంగా నిర్ణయించడానికి ఈ ప్రాథమిక పరిశీలన సరిపోదని నాసా తెలిపింది.
తాజాగా ఈ విషయాలపై వాషింగ్టన్ లోని నాసా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ స్పందించారు. ఒక పెద్ద గ్రహశకలం ప్రభావం అనేది మానవాళికి ఉన్న ఏకైక సహజ విపత్తు అని.. ఇది సంవత్సరాల ముందుగానే అంచనా వేయడానికి, నిరోధించడానికి తగిన సమయం, సాంకేతికత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ప్రత్యేకంగా సవాలు చేసే పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.