"టీ"పొత్తులో తుఫాన్... బాలయ్య వర్సెస్ పవన్!
అసలు తెలంగాణలో జనసేనతో పోలిస్తే టీడీపీకి బలం ఎక్కువగా ఉందని చెబుతున్నా... టీడీపీని కాదని జనసేనతోనే బీజేపీ పొత్తు పెట్టుకోవడం వెనుక బలమైన కారణం ఉందని.. అదే స్టార్ క్యాంపెయినర్ సమస్య అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారంట.
By: Tupaki Desk | 26 Oct 2023 10:17 AM GMTతెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిగిలిన ప్రధాన పార్టీలతో పోలిస్తే బీజేపీ కాస్త వెనుకబడిందనే కామెంట్లు నిన్నటివరకూ వినిపించాయి! అయితే... లేట్ గా వచ్చినా కాస్త లేటెస్ట్ గా వచే ప్రయత్నంలో భాగమో ఏమో కానీ... జనసేనను కలుపుకుని రాబోతోంది బీజేపీ! అయితే ఈ కలయిక, ఈ అవగాహనా తెలంగాణ ఎన్నికల వరకేనా.. లేక, ఏపీలో కూడా ఉంటుందా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. అలా అని ఆ కోరిక బీజేపీకి లేదని అనలేని పరిస్థితి అని ఆ పార్టీలోని కొందరి అభిప్రాయం!
ఆ సంగతి అలా ఉంటే... తెలంగాణ ఎన్నికల్లో ప్రస్తుతానికి ఒంటరిగా పోటీచేయబోతున్నట్లు ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ లో పొత్తులు వస్తే చిన్న చిన్న మార్పులకు అవకాశం ఉందని అన్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల పేర్లు ప్రస్థావించకుండా... కీలకమైన 32 నియోజకవర్గాల పేర్లు మాత్రం ప్రకటించారు. అనంతరం పోటీపై ఒత్తిడి వస్తుందని, ఆలోచించి చెబుతానని పవన్.. తెలంగాణ జనసేన నాయకులతో చెప్పినట్లు పత్రికా ప్రకటన కూడా ఆ పార్టీ విడుదల చేసింది!
ఈ సమయంలో ఏపీలో టీడీపీతో పొత్తునూ ప్రకటించిన పవన్ కల్యాణ్.. మరోపక్క తాను ఎన్డీఏలో ఉన్నట్లు ప్రకటించారు. ఆ స్థాయిలో సాగుతున్న పవన్ రాజకీయాల సంగతి అలా ఉంచితే... ఇటీవల ఆయనతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. కలిసి పోటీ చేద్దామనే ప్రతిపాదన తెచ్చారని అంటున్నారు. అనంతరం పవన్, కిషన్ రెడ్డి కలిసి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారానికల్లా సీట్ల సర్ధుబాటుపై క్లారిటీకి రావాలని అమిత్ షా ఆదేశించారని తెలుస్తుంది.
అయితే... బీజేపీతో పొత్తుకు ముందు 32 స్థానాల్లో పొటీ అని నియోజకవర్గాల పేర్లు ప్రకటించాము కాబట్టి... కాస్త అటు ఇటుగా 20 స్థానాలైనా ఇవ్వాలని జనసేన నుంచి బీజేపీకి రిక్వస్ట్ వెళ్లిందని అంటున్నారు. అది కాస్త గౌరవప్రదంగా ఉంటుందని.. అది రేపు ఏపీలో టీడీపీ వద్ద టిక్కేట్లు డిమాండ్ చేసే విషయంలో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారని కథనాలొస్తున్నాయి!
అయితే... తెలంగాణలో బీజేపీ ఇప్పటికే 52 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన 67 నియోజకవర్గాలలోనూ సుమారు 61 - 62 స్థానాలకు అభ్యర్థులు రెడీగా ఉన్నారని అంటున్నారు. నవంబర్ 1 తర్వాత ఆ లిస్ట్ విడుదల అవ్వొచ్చని కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన 5 - 6 స్థానాలు జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.
ఇక జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేసినా.. పవన్ ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చి, తెలంగాణలో బీజేపీ - జనసేన జెండాలతో పవన్ ప్రచారానికి సన్నదమవుతున్నారని తెలుస్తుంది. పైగా ఇప్పటికే బీఆరెస్స్, కాంగ్రెస్ లు ప్రచారంలో దూకుడు పెంచడంతో... పవన్ పై ఒత్తిడి ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
అసలు తెలంగాణలో జనసేనతో పోలిస్తే టీడీపీకి బలం ఎక్కువగా ఉందని చెబుతున్నా... టీడీపీని కాదని జనసేనతోనే బీజేపీ పొత్తు పెట్టుకోవడం వెనుక బలమైన కారణం ఉందని.. అదే స్టార్ క్యాంపెయినర్ సమస్య అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారంట. ఇందులో భాగంగానే పవన్ తో పొత్తు పెట్టుకున్నారని.. ఫలితంగా జనసమీకరణకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తున్నారని సమాచారం.
ఆ సంగతి అలా ఉంటే... తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేయబోతోందని అంటున్నారు. ఇప్పటికే ఒక జాబితాను సిద్ధం చేసుకుని ఫైనల్ అప్రూవల్ కోసం కాసాని జ్ఞానేశ్వర్ ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. అయితే... తెలంగాణలో టీడీపీకి కూడా ఒక స్టార్ క్యాపెయినర్ ని సిద్ధం చేసింది అ పార్టీ. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన అనంతరం... మరణించినవారి కుటుంబాలను ఓదార్చడానికి తాను వెళ్తున్నట్లు ప్రకటించిన బాలయ్యను.. తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ గా పంపించారట చంద్రబాబు!
అక్కడ బాలయ్య ప్రకటించిన ఓదార్పు యాత్రకు "న్యాయం గెలవాలి" అనే నామకరణం చేసి భువనేశ్వరితో బస్సు యాత్ర చేయిస్తున్నారని చెబుతున్నారు! దీంతో... తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బాలయ్య ఫుల్ టైం స్టార్ క్యాంపెయినర్ గా పనిచేయబోతున్నారట బాలయ్య. అంటే... టీడీపీ తరుపున బాలయ్య... వారి వైరి వర్గంగా బరిలోకి దిగుతున్న బీజేపీ - జనసేన కూటమికి స్టార్ క్యాంపెయినర్ గా పవన్ కల్యాణ్ ప్రచారాలు చేయబోతున్నారన్నమాట!
దీంతో... పొత్తులో భాగంగా ఏపీలో కలిసిమెలిసి పనిచేసుకోవాల్సిన వీరు, ఉమ్మడిగా ప్రచారం చేసుకోవాల్సిన వీరిద్దరూ... తెలంగాణలో మాత్రం ప్రత్యర్ధులుగా రంగంలోకి దిగబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... బీజేపీ- జనసేన కూటమి తెలంగాణలో టీడీపీని పెద్దగా టార్గెట్ చేయకపోవచ్చు కానీ... టీ.టీడీపీ మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆరెస్స్ తోపాటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది!
మరి ఈ కఠిన సమయంలో బాలయ్య ఫెర్మార్మెన్స్ కాస్త పీక్స్ లోనే ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇలా బాలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించగానే... పవన్ కూడా మైకందుకుని టీ.టీడీపీని కూడా దుయ్యబట్టాల్సిన అవసరం ఆటోమెటిక్ గా ఏర్పడుతుంది! మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను బాలయ్య – పవన్ లు ఎలా హ్యాండిల్ చేస్తారనేది వేచి చూడాలి. ఏది ఏమైనా... “ఇది బీజేపీ మార్కు రాజకీయ చాణక్యం” అని కొందరంటుంటే... “పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం అవసరమా” అని మరికొందరు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం!