Begin typing your search above and press return to search.

ఈజిప్టులో తాజాగా వెలుగులోకి వచ్చిన 36 సమాధులు.. 1400 మమ్మీలు..

ఈజిప్ట్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది మమ్మీలు. ఇంట్లో మమ్మీలు కాదండోయ్ పిరమిడ్ లో మమ్మీలు

By:  Tupaki Desk   |   29 Jun 2024 2:45 AM GMT
ఈజిప్టులో తాజాగా వెలుగులోకి వచ్చిన 36 సమాధులు.. 1400 మమ్మీలు..
X

ఈజిప్ట్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది మమ్మీలు. ఇంట్లో మమ్మీలు కాదండోయ్ పిరమిడ్ లో మమ్మీలు. చిన్నపిల్లల కామిక్ స్టోరీల దగ్గర నుంచి హారర్ చిత్రాల వరకు మమ్మీల తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈజిప్ట్ నైల్ నది తీరాన నిర్మించబడిన త్రికోణపు కట్టడాలను మమ్మీలు అంటారు. ఇప్పటికే ఈజిప్టు ప్రాంతంలో ఎన్నో పిరమిడ్ల నుంచి మమ్మీలు బయటపడ్డాయి. తాజాగా 36 సమాధులను పరిశోధించగా వాటి నుంచి 1400 మమ్మీలు వెలుగులోకి వచ్చాయి.

ఇవి లభ్యమైన ప్రాంతాన్ని ఆస్వాన్ అని పిలుస్తారు. ఇది నైలు నది తూర్పు ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం. పురాతన ఈజిప్ట్ యొక్క సరిహద్దు నగరంగా ఆస్వాన్ కు చరిత్రలో మంచి గుర్తింపు ఉంది. నిజానికి ఈజిప్ట్ చరిత్ర ఒక అద్భుతమైన కథ. ఇది మనకు తెలిసినట్లుగానే ఉంటుంది కానీ ఇందులో అనేక రహస్యాలు దాగి ఉంటాయి. 3000 సంవత్సరాలకు పూర్వం అంత ఎత్తున ఉన్న పిరమిడ్ ఆకారాలను ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ.

ఆ పిరమిడ్లలో అప్పటి చక్రవర్తుల దేహాలను పరిరక్షించడం కోసం మమ్మీలుగా మార్చి పెట్టేవారు. అంతేకాదు ఈ మమ్మీ లను పెట్టిన పిరమిడ్లలో సంపద కూడా దాగి ఉంటుంది అనే నమ్మకంతో ఎంతోమంది పిరమిడ్లలో నిధి అన్వేషణకి వెళ్లేవారు. ఈ పిరమిడ్ల గురించి, వీటిని నిర్మాణం గురించి ఎన్నో కథలు ఈజిప్ట్ గాలులలో ఈరోజుకి కూడా వినిపిస్తాయి. ఇప్పటికీ ఈజిప్ట్ లో ఎన్నో పిరమిడ్లను ,మమ్మీలను కనుక్కున్నారు.. కానీ ఇంకా వాటి వెనుక ఛేదించాల్సిన మిస్టరీ ఎంతో ఉంది.

నైలు నదికి తూర్పు తీరంలో ఉన్న 'అస్వాన్'గా సుమారు

2.70 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతం 4,500 సంవత్సరాల క్రితం నాటిదని నిపుణుల అంచనా. తాజాగా ఇక్కడ 36 సమాధులను పరిశోధకులు పరిశీలించగా.. 1400కు పైగా మమ్మీలు బయటపడ్డాయి. అంటు రోగాలు సోకిన వారిని ఇలా సామూహికంగా ఖననం చేసి ఉంటారు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మమ్మీలను గుర్తించడం కోసం సుమారు ఐదు సంవత్సరాల పాటు శ్రమించినట్టుగా వారు వెల్లడించారు. వీటిపై మరింత పరిశోధన జరిపిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయి.