ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సీన్.. సభలో బాబాయ్.. గ్యాలరీలో అబ్బాయ్
వ్యవసాయ మంత్రిగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
By: Tupaki Desk | 1 March 2025 10:53 AM ISTఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టే సందర్భంగా కేంద్ర మంత్రి అచ్చెన్నాయుడు సందర్శకుల గ్యాలరీలో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు బాబాయ్ అవుతారన్న సంగతి తెలిసిందే.
వ్యవసాయ మంత్రిగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ప్రసంగానని పూర్తి చేసిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుంటూ.. పైన గ్యాలరీలో మీ అబ్బాయి చూస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడికి చెప్పారు.
అదే సమయంలో గ్యాలరీలో కూర్చున్న రామ్మోహన్ కూడా స్పీకర్ కు అభివాదం చోటు చేసుకుంది. స్పీకర్ వ్యాఖ్యలకు సభలోని సభ్యులు అందరూ నవ్వులు చిందించారు. అసెంబ్లీ సమావేశం తర్వాత టీడీపీ ఎంపీలు.. ఎమ్మెల్సీల సమావేశం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు వీలుగా అసెంబ్లీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ వచ్చారు. పనిలో పనిగా బాబాయ్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న వేళలో.. అబ్బాయి గ్యాలరీ నుంచి వీక్షించటం ఆసక్తికరంగా మారింది.