అతియా - KL రాహుల్ కొత్త అపార్ట్‌మెంట్ షాకిచ్చే ఖరీదు!
ఈ జంట జూలై 15న రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 1.20 కోట్ల విలువైన స్టాంప్ డ్యూటీ సహా రూ. 30,000 ఇతర ఖర్చులు చెల్లించారు.
By: Tupaki Desk | 19 July 2024 3:25 AM GMTముంబయి- బాంద్రాలో సినీ నటి అథియా శెట్టి- క్రికెటర్ కేఎల్ రాహుల్ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. జాతీయ మీడియా కథనం ప్రకారం.. బాంద్రాలోని పాలి హిల్‌లోని ఎత్తైన భవనంలో ఈ జంట కొత్త అపార్ట్‌మెంట్ ఉంది. దీని విలువ రూ. 20 కోట్లు.
బాంద్రా ముంబైలోని టాప్ సెలబ్రిటీలు నివశించే ప్రాంతం. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్, రణబీర్ కపూర్, అలియా భట్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ సహా చాలా మంది ప్రముఖులు ఇక్కడ నివశిస్తున్నారు. ఇండస్ట్రీ టాప్ స్టార్లు ఇక్కడ అపార్ట్ మెంట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు అతియా శెట్టి -KL రాహుల్ వారికి పొరుగువారు కాబోతున్నారు. తాజా కథనాల ప్రకారం.. ఈ జంట సంధు ప్యాలెస్ భవనంలోని రెండవ అంతస్తులో 3350 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. అపార్ట్‌మెంట్‌లో నాలుగు కార్ల పార్కింగ్ స్థలం కూడా ఉంది. 18 అంతస్తుల భవనం బాంద్రాలోని నర్గీస్ దత్ రోడ్డులో ఉంది.
ఈ జంట జూలై 15న రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 1.20 కోట్ల విలువైన స్టాంప్ డ్యూటీ సహా రూ. 30,000 ఇతర ఖర్చులు చెల్లించారు. అయితే ఈ భవనం BMC నుండి పాక్షిక ఆక్యుపేషన్ సర్టిఫికేట్‌ను మాత్రమే పొందింది. దీని వలన దంపతులు ఆ ఇంటికి చేరేదెప్పటికి? అనే దానిపై స్పష్టత లేదు.
అతియా శెట్టి - KL రాహుల్ ఇద్దరూ ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు. వారు ఇటీవల అథియా సోదరుడు అహన్ శెట్టితో కలిసి మంగళూరులోని కుట్టారు కొరగజ్జన ఆలయంలో దర్శనానికి వెళ్లిన ఫోటోలు కనిపించాయి. గత ఏడాది జనవరిలో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకున్నారు.