Begin typing your search above and press return to search.

దేశంలో నేత‌లే కాదు.. వారి మ‌ద్ద‌తు దారులూ బాధితులేనా? తాజా అప్డేట్ ఇదే!

అతీక్‌ అహ్మద్‌ తరఫు న్యాయవాది విజయ్‌ మిశ్రను పోలీసులు అరెస్టు చేశారు

By:  Tupaki Desk   |   31 July 2023 11:30 PM GMT
దేశంలో నేత‌లే కాదు.. వారి మ‌ద్ద‌తు దారులూ బాధితులేనా?  తాజా అప్డేట్ ఇదే!
X

మ‌న‌ను కాద‌నేవారు.. మ‌న‌ల‌ను ఎదిరించేవారు శ‌త్రువులు! ఇది స‌హ‌జంగానే స‌మాజ నైజం కూడా. ఇక, రాజ‌కీయాల్లో అయితే.. ఇది త‌ర‌త‌రాలుగా.. పార్టీల‌కు పార్టీల్లో ఇది కొన‌సాగుతోంది. ఇక‌, నాయ‌కుల విష‌యా నికి వ‌చ్చినా అంతే. పార్టీల‌ను వ్య‌తిరేకించే నాయ‌కులు, నాయ‌కుల నిబ్ధ‌త‌ను ప్ర‌శ్నించే వ్య‌క్తులు.. విధానా ల‌పై నిప్పులు చెరిగే మేధావులు.. ఇలా.. అనేక రూపాల్లో త‌మ‌కు గిట్ట‌నివారిని శ‌త్రువులుగా చూస్తున్న పాల‌కులు ఉన్నారు.

కేంద్రంలోని మోడీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. మేధావులు, ర‌చ‌యిత‌లు కూడా.. జైళ్ల‌లో మ‌గ్గుతున్న విషయం తెలిసిందే. ప్ర‌ధాని మోడీని హ‌త‌మార్చేందుకు.. కుట్ర ప‌న్నార‌నే కార‌ణంగా.. వ‌ర‌వ‌ర‌రావు, ప్రొఫెస‌ర్ విజ‌య్‌కుమార్ వంటివారిని ఏళ్ల త‌ర‌బ‌డి జైళ్ల‌లోనే పెట్టారు. క‌నీసంవారికి బెయిల్ కూడా ఇవ్వ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. స‌రే.. ఇప్పుడు నేత‌ల మాట ఎలా ఉన్నా.. వారికి మ‌ద్ద‌తుగా ఉంటున్న‌వారి ప‌రిస్థితి కూడా పెనం మీద నుంచి పొయ్యిలోకి పడుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

త‌మ‌కు గిట్ట‌నివారు.. లేదా త‌మ‌పై పోరాటం చేస్తున్న‌వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌వారు ఎంత‌టి స్థానాల్లో ఉన్నా.. వారిపై కేసులు పెట్టేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గ్యాంగ్‌స్ట‌ర్ క‌మ్ రాజ‌కీయ నాయ‌కుడు అతిఖ్ అహ్మ‌ద్‌ను, ఆయ‌న సోద‌రుడు అష్రాఫ్‌ను జ‌ర్న‌లిస్టుల ముసుగులో కొంద‌రు వచ్చి అతి స‌మీపం నుంచి కాల్చి చంపిన విష‌యం తెలిసిందే.ఈ దారుణం.. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ఇక‌, అతీఖ్ హ‌త్య‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆయ‌న త‌ర‌ఫు లాయ‌ర్‌.. కోర్టులో రెండు వారాల కింద పిటిష‌న్ వేశారు.

అతీఖ్ హ‌త్య వెనుక‌.. అదికార పార్టీ(బీజేపీ), ప్ర‌భుత్వం కూడా ఉంద‌ని ఆయ‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విచార‌ణ ఈ వారంలో రావాల్సి ఉంది. కానీ, ఇక్క‌డే సంచ‌ల‌న విష‌యం చోటు చేసుకుంది. అతీక్‌ అహ్మద్‌ తరఫు న్యాయవాది విజయ్‌ మిశ్రను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి వారు చూపిన కార‌ణం.. బీఎస్‌పీ(మాయావ‌తి నేతృత్వంలో పార్టీ) మాజీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్య కేసులో ప్రత్య క్ష సాక్షిగా ఉన్న ఉమేష్‌పాల్‌ను కాల్చి చంపిన సంఘటనలో ఆయనకు ప్రమేయం ఉందని.

ఉమేష్‌పాల్‌ ఎక్కడ ఉన్నదీ షూటర్‌కు లోకేషన్‌ను అందించింది ఆయనేనని తెలిపారు. అయితే.. వాస్త‌వానికి ఈ విష‌యంలో విజ‌య్ మిశ్రా ప్ర‌మేయం లేద‌న్న‌ది బార్ వ‌ర్గాల మాట‌. కానీ, అతీఖ్ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నందుకే.. ఆయ‌న‌పై కేసు పెట్టార‌ని వారు అంటున్నారు. మొత్తానికి ఒక కేసును నిర్వీర్యం చేసేందుకు.. ఆ కేసుకు సంబంధించి మూలాల‌ను కూడా తుంచేయ‌డ‌మేన‌ని అంటున్నారు.