"ఆంటీ రే*ప్ అంటే ఏమిటి?"... అడిగిన రెండు రోజులకే ఘోరం!
ఇలా వయసుతో సంబంధం లేకుండా ఆడ పిల్ల అయితే చాలు అంటూ మృగాళ్లు చెలరేగిపోతున్నారు.
By: Tupaki Desk | 26 Aug 2024 10:30 AM GMTఇటీవల కాలంలో వరుసగా తెరపైకి వస్తున్న అత్యాచార ఘటనలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కోల్ కతాలోని జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన తీవ్ర సంచలనంగా మారిన వేళ, తమిళనాడులో ఆరు నెలల పసికందుపై స్వయంగా తండ్రే లైంగిక దాడికి పాల్పడిన పరిస్థితి. ఇదే క్రమంలో... అస్సాంలో పదో తరగతి బాలిపై గ్యాంగ్ రే*ప్.
ఇలా వయసుతో సంబంధం లేకుండా ఆడ పిల్ల అయితే చాలు అంటూ మృగాళ్లు చెలరేగిపోతున్నారు. భరతమాత గుండెలపై గాయాలు చేస్తూనే ఉన్నారు. అత్యాచారాలకు బలైన ఆడపిల్లల కన్నీటితో ఈ నెల తడిసి ముద్దవుతుంది. ఈ నేపథ్యంలో అస్సాంలో పదోతరగతి చదువుతున్న బాలికపై గ్యాంగ్ రే*ప్ ఘటనలో ఓ హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... అస్సాంలో పదోతరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు మృగాళ్లు గ్యాంగ్ రే*ప్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన జరిగిన రెండు రోజుల క్రితమే కోల్ కతాలో జూనియార్ వైద్యురాలి హత్యాచార ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ.. దానికి సంబంధించిన విషయాన్ని పేపర్లో చదివి తెలుసుకుందంట. అనంతరం... అత్యాచారం అంటే ఏమిటి అని తన బంఢువును అడిగిందంట.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఆ బాలిక బంధువు... కోల్ కతా ఘటన గురించి పత్రికలో చదివిన ఆమె... తనతో "ఆంటీ రే*ప్ అంటే ఏమిటి?" అని అడిగిందని తెలిపారు. అయితే.. తనకే ఇలా జరుగుతుందని అనుకోలేదని, ఆమెను రక్షించడంలో తాను విఫలమయ్యాయని అనిపించిందని ఆమె వెల్లడించారు.
ఇక డీఎస్పీ కావాలని బాలిక కలలు కనేదని.. ఆస్పత్రిలో తనను కలిసేందుకు డీఎస్పీ వస్తే అంత కష్టంలోనూ ముఖంలో నవ్వు ప్రదర్శించిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా స్పందించిన బాలిక తండ్రి... ఈ స్థితిలో తన కుమర్తెను చూస్తే గుండె ముక్కలైందని.. కనిసం తనతో మాట్లాడలేకపోయిందని వాపోయారు. ఆయనకు చదివించే స్థోమత లేక ఈ బంధువు వద్దకు పంపారట.
కాగా... అస్సాంలోని నాగావ్ జిల్లాకు చెందిన బాలిక ట్యూషన్ నుంచి సైకిల్ పై ఇంటికి బలుదేరింది. ఈ సమయంలో అదె దారిలో బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి, సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడి పారిపోయారు. ఈ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు గమనించి రక్షించారు.