హాస్టల్ లో అమ్మాయి మర్డర్ అతిపెద్ద ట్విస్ట్ ఇదే!
ఈ క్రమంలో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 4 Aug 2024 6:20 AM GMTకొద్ది రోజుల క్రితం బెంగళూరు కోరమంగల మహిళా పీజీ హాస్టల్ లోకి చొరబడి కృతి కుమారి అనే యువతిని ఒక ఉన్మాద ప్రేమికుడు హత్యచేసి పరారయిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి సీసీ పుటేజీ వీడియో సంచలనం రేకెత్తించింది. హాస్టల్ లోకి చొరబడి ఆమెను కత్తితో కసిదీరా పలుచోట్ల పొడిచాడు. ఆమె గొంతు కోశాడు. ఆమె సహాయం కోసం బిగ్గరగా కేకలు వేయడం, మిగిలిన అమ్మాయిలు ఇది చూసి కూడా ఎవరూ సహాయం చేయకపోవడం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.
కాగా యువతిని హత్య చేసిన నిందితుడు మధ్యప్రదేశ్ కు చెందిన అభిషేక్ గా పోలీసులు తేల్చారు. హత్య చేశాక భోపాల్ పారిపోయిన నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ కు చెందిన రియా అనే అమ్మాయిని అభిషేక్ ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులో రియాకు ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి వెళ్లింది. పీజీ హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది.
దీంతో అభిషేక్ కూడా బెంగళూరు వెళ్లాడు. అయితే అతడికి ఎలాంటి ఉద్యోగం లేదు. ఈ క్రమంలో ప్రేమికుల ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో రియా అభిషేక్ తో సరిగా మాట్లాడటం లేదు. కొన్నిసార్లు కృతి కుమారి కలగచేసుకుని వారికి సర్దిచెప్పేది. దీంతో ఆమెపై అతడు కక్ష పెంచుకున్నాడు. కృతిని వదిలి వచ్చేయాలని రియాకు సూచించాడు. అయితే రియా అతడి మాటలకు అంగీకారం తెలపలేదు. దీంతో రియాను చంపాలని ఆమె ఉంటున్న హాస్టల్ కు వెళ్లాడు.
జూలై 23 రాత్రి 11 గంటల తర్వాత సెక్యూరిటీ గార్డు చూడకుండా హాస్టల్ మూడో అంతస్తులోకి ప్రవేశించి రియా ఉంటున్న గది తలుపు తట్టాడు. ఈ క్రమంలో రియాకు బదులుగా హత్యకు గురయిన ఆమె స్నేహితురాలు కృతి కుమారి తలుపుతీసింది. దీంతో కృతి వల్లే రియా తనకు దూరమైందని.. ఆమె చెప్పుడు మాటల వల్లే తనను దూరం పెట్టిందని అపోహలతో ఉన్న అభిషేక్.. కృతిని తన వెంట తెచ్చుకున్న కత్తితో కసిదీరా పొడిచాడు. కొంతసేపటికి ఆమె తీవ్ర రక్తగాయాలతో మృతిచెందింది.
కృతిని చంపాక అభిషేక్ తన స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు వెళ్లిపోయాడు. అయితే హత్య మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు రియా నుంచి వివరాలు రాబట్టారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడిని భోపాల్ ను అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు 10 రోజుల కస్టడీకి అప్పగించింది.