పవన్ కాన్వాయ్ పై చెప్పులతో దాడి... నిందితుడు కాంగ్రెస్ కార్యకర్త?
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ పై ఓ వ్యక్తి చెప్పులు విసరడం చర్చనీయాంశం అయ్యింది. ఆ వ్యక్తి చెప్పులు విసిరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
By: Tupaki Desk | 24 Nov 2023 11:55 AM GMTతెలంగాణలో ఎన్నికలకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉండగా... పవన్ కల్యాణ్ ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో.. పవన్ కల్యాణ్ ప్రచారానికి రారని.. కటౌంట్ మాత్రం పంపిస్తారన్నట్లుగా సోషల్ మీడియా కామెంట్లు కనిపించాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ పవన్ ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే రెండు రోజుల్లో నాలుగు నియోజకవర్గాలతో మమ అనిపించడం ఒక్కటే అభిమానులకు అసంతృప్తి కలిగించిన అంశం అని చెబుతున్నారు.
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో 119 నియోజకవర్గాలకు గానూ 8 నియోజకవర్గాల్లో ఓఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో అటు జనసేన, ఇటు బీజేపీ నేతల కోసం పవన్ కల్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే ఆ ప్రసంగాలు చప్పగా సాగాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ పై ఓ వ్యక్తి చెప్పులు విసరడం చర్చనీయాంశం అయ్యింది. ఆ వ్యక్తి చెప్పులు విసిరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే... అదృష్టవశాత్తూ ఇది జరిగే సమయానికి పవన్ కళ్యాణ్ వాహనంలోకి వెళ్లారు. ఈ ఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. దీంతో నిందితుడిని పట్టుకున్న జనసేన కార్యకర్తలు అతడిని గటీగా కొట్టినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో పవన్ కాన్వాయ్ పై చెప్పులు విసిరిన నిందితుడు కాంగ్రెస్ కార్యకర్త అని తాజాగా వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీతో భారత్ జూడో యాత్రలో ఆ వ్యక్తి పాల్గొన్నాడంటూ ఫోటోలు తెరపైకి రావడంతో ఇప్పుడు వ్యవహారం మరో పెద్ద మలుపు తిరిగిందిని అంటున్నారు. ఎన్నికల సమయం కావడంతో పూర్తిగా రాజకీయ రంగు పులుముకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ కాన్వాయ్ పై చెప్పులు విసిరిన వ్యక్తి... రాహుల్ గాంధీతో నడుస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నిందితుడు కాంగ్రెస్ కార్యకర్త కావడంతో వ్యవహారం ఊహించని మలుపు తిరిగిందనే భావించాలి! మరి తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి!