పవన్ మీద కిరాయి మూకల దాడులు...!?
పవన్ కళ్యాణ్ అంటే ఆషామాషీ నేత కాదు, ఆయన సినీ గ్లామర్ పుష్కలంగా ఉన్న వారు. ఆయన చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ గట్టిగా ఉంటుంది
By: Tupaki Desk | 2 April 2024 2:30 AM GMTపవన్ కళ్యాణ్ అంటే ఆషామాషీ నేత కాదు, ఆయన సినీ గ్లామర్ పుష్కలంగా ఉన్న వారు. ఆయన చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ గట్టిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కోరుకుంటే తప్ప ఆయన దగ్గరకు వెళ్లేందుకు ఎంతటి పెద్ద వారు ప్రయత్నించినా కలిసేది ఉండదు.
ఇటీవల ముద్రగడ పద్మనాభం కూడా అదే చెప్పారు. పవన్ ని తాను ఎప్పుడూ కలవలేదని అని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా మరో సందర్భంలో చెప్పారు. తాను చిరంజీవిని కలిశాను తప్ప పవన్ ని ఎపుడూ కలవలేదు, చూడలేదు అని. ఆయనను అందరిలాగానే టీవీలలో చూడడమే అని.
అలా పవన్ చుట్టూ ఒక బలమైన భద్రతా వలయం ఉంటుంది. ఆయన పొలిటీషియన్ కంటే ముందు సూపర్ స్టార్. ఆ సెక్యూరిటీ ఆ చుట్టూ ఒక కవచం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంతవరకూ ఎందుకు పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారు.
ఆయనకు టీడీపీ నేత వర్మ మద్దతు ప్రకటించారు. ఆయన పవన్ ఉన్న బస ప్రాంతానికి వస్తే ఆయన చాలా ప్రయత్నం చేసిన మీదటనే లోపలికి వెళ్ళగలిగారు అని వార్తలు వచ్చాయి. అంతలా టైట్ సెక్యూరిటీతో ఉండే పవన్ మీద కిరాయి మూకల దాడి చేయడం అన్నది జరుగుతుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న.
అయితే పవన్ వంటి వారు అన్నారు కనుక నమ్మక తప్పదు. ఆయన ఏపీలో మూడవ ప్రాంతీయ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. పవన్ సోమవారం కాకినాడలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే తనను కలిసేవారిలో కిరాయి మూకలు ఉన్నాయని పవన్ చెప్పారు.
తనపైనా తన సెక్యూరిటీపైనా బ్లేడ్లతో దాడి చేస్తున్నారు అని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అందుకే ప్రత్యర్ధి పార్టీ పన్నాగాలకు జాగ్రత్తగా ఉండాలని వైసీపీ మీద ఇండైరెక్ట్ గా హాట్ కామెంట్స్ చేశారు. అందుకే అందుకే తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని ఆయన అన్నారు. ఇక తనను కలిసేవారితో ఫొటోలు దిగడానికి సిద్ధం అని పవన్ చెప్పారు.
ఇవన్నీ ఓకే కానీ పవన్ మీద సన్నని బ్లేడ్లతో దాడులకు తెగబడానికి ముఠా సిద్ధంగా ఉందా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. పవన్ అంటే ఎంత ఇష్టపడే అభిమానులు వేలాదిగా ఎపుడూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా అలాంటి ఆకతాయి పని చేసినా తప్పించుకోగలడా అన్నది పెద్ద డౌట్.
అలా దుస్సాహసం ఎవరైనా చేసినా వారిని పోలీసులకు పట్టించేలోగానే పవన్ వీరాభిమానుల చేతిలో తగిన శాస్తి కూడా జరిగిపోతుంది. ఇవన్నీ తెలిసి ఎవరూ పవన్ జోలికి కూడా రారు. అయితే పవన్ కి ఏమైనా సంకేతాలు వచ్చి ఉండాలి. లేక ఏదైనా ఇంటలిజెన్స్ హెచ్చరికలు అయినా అయి ఉండాలి. లేకపోతే అలా ఆయన అనరు కదా. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి పనులు ఎవరు చేసినా కోరి ప్రమాదంలో పడినట్లే. వారి చేత చేయించాలనుకున్న వారు కూడా బిగ్ ట్రబుల్స్ కోరి తెచ్చుకున్నట్లే అంటున్నారు.