Begin typing your search above and press return to search.

చంద్రబాబును వెంటాడుతున్న అప్పటి కేసు !

ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, గాయపడిన పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారని,

By:  Tupaki Desk   |   14 May 2024 8:16 AM GMT
చంద్రబాబును వెంటాడుతున్న అప్పటి కేసు !
X

2010లో ఓ నిరసనకు సంబంధించి చంద్రబాబు, ఆనందబాబును ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో జైలు సిబ్బందిపై వారు దాడిచేసినట్టు అప్పట్లో క్రిమినల్ కేసు నమోదైంది.

తాజాగా, ఈ కేసును విచారించిన జస్టిస్ మంగేశ్ పాటిల్, జస్టిస్ శైలేశ్ బ్రహ్మేలతో కూడిన ధర్మాసనం.. నేరారోపణలో నిందితుల ప్రమేయాన్ని బయటపెట్టేందుకు తగిన ఆధారాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు చంద్రబాబు, ఆనందబాబు మీద కేసును కొట్టేసేందుకు నిరాకరించింది.

ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, గాయపడిన పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారని, దీనినిబట్టి నేరానికి సంబంధించి తగిన సమాచారం ఉన్నట్టేనని, కాబట్టి కేసును కొట్టివేయడం సముచితం కాదని ధర్మాసనం పేర్కొంది. నిందితులపై కేసు నమోదు, దర్యాప్తు వంటి వాటిలో చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్టు తమకు అనిపించలేదని వెల్లడించింది.

అయితే, 13 సెప్టెంబర్ 2023న చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర ఉపశమనాన్ని జులై 8 వరకు పొడిగించింది. ఫలితంగా ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకాకుండా చంద్రబాబుకు మినహాయింపు లభించింది.