Begin typing your search above and press return to search.

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం.. ఉల్లంఘిస్తే షాకింగ్ ఫైన్!

పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   27 Nov 2024 6:38 AM GMT
16 ఏళ్లలోపు వారికి సోషల్  మీడియా నిషేధం.. ఉల్లంఘిస్తే షాకింగ్  ఫైన్!
X

ఈ రోజుల్లో ఎదుగుతున్న పిల్లలపై, చదువుకుంటున్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ఇందులో మంచి కంటే చాలా రెట్లు ఎక్కువగా చెడు ప్రభావమే కనిపిస్తొందనే చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తల్లితండ్రుల నుంచి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని అంటారు.

ఈ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ఫిక్సయ్యింది. ఈ క్రమంలో... దీనికి సంబంధించిన బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ప్రవేశపెట్టగా 102 మందితో ఆమోదం పొందగా.. 13 మంది మాత్రం దీన్ని వ్యతిరేకించారు.

అవును... పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 16 ఎళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బిల్లు పాసవ్వగా.. త్వరలో చట్టం తీసుకురాబోతోంది. ఈ బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపితే చట్టరూపం దాల్చనుంది.

తాజాగా పాసైన బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత.. వయో పరిమితుల అమలు విషయంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లకు ఏడాది పాటు సమయం ఇవ్వనున్నారు. అంటే... 12 నెలల్లో ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్.. వీటిని చిన్న పిల్లలు వినియోగించకుండా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందన్నమాట.

అయితే.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం తీవ్ర చర్యలు తీసుకోబోతుందని అంటున్నారు. ఇందులో భాగంగా... 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.273 కోట్లు) జరిమానా విధిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇది అమల్లోకి వస్తే.. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ తరహా నిబంధనలు ఉన్న చట్టంగా ఇది నిలవనుంది.

ఈ చట్టం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, టిక్ టాక్, స్నాప్ చాట్, రెడిట్ తదితర ఫ్లాట్ ఫామ్స్ కు వర్తించనుందని అంటున్నారు. దీనిపై స్పందించిన ప్రధాని ఆటోనీ ఆల్బనీస్... తల్లితండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు