Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో మండిస్తున్న ఎండలు.. చెమటలు పుట్టించేలా గణాంకాలు!

ఆస్ట్రేలియాలో తాజాగా దంచికొడుతున్న ఎండలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. మెల్ బోర్న్ లో సోమవారం 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణగ్రతలు నమోదు కావటం రికార్డుగా మారింది.

By:  Tupaki Desk   |   28 Jan 2025 5:06 AM GMT
ఆస్ట్రేలియాలో మండిస్తున్న ఎండలు.. చెమటలు పుట్టించేలా గణాంకాలు!
X

గతంలో విన్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఎంతన్నది ఇప్పుడు వాస్తవంలో ఎదుర్కొంటున్న మానవాళి.. సమీప భవిష్యత్ ఎంత భయానకంగా ఉంటుందన్న విషయం ఆస్ట్రేలియాలో తాజాగా దంచికొడుతున్న ఎండలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. మెల్ బోర్న్ లో సోమవారం 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణగ్రతలు నమోదు కావటం రికార్డుగా మారింది. దీనికి కారణం.. జనవరిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 14 డిగ్రీలు అధికం కావటమే దీనికి కారణం.

సోమవారం ఆస్ట్రేలియాలో తీవ్ర వడగాల్పులు వీచాయి. దీంతో.. ఆ దేశంలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అదే సమయంలో.. కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉండటంతో ఆ దేశ సర్కారు అప్రమత్తమైంది. విక్టోరియా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక ఆంక్షలు విధిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. 2019-20 బ్లాక్ సమ్మర్ తర్వాత ఈ ఏడాదే అంత తీవ్రస్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లుగా చెబుతున్నారు.

తాజాగా న్యూ సౌత్ వెల్స్.. సౌత్ ఆస్ట్రేలియా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. క్వీన్స్ ల్యాండ్.. నార్తర్న్ టెరిటరీ రాష్ట్రాల్లో రెండు అగ్నిమాపక ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్నది ఈ ఆదేశాలే చెప్పేస్తున్నాయని చెబుతున్నారు. వేడి గాలుల కారణంగా పెద్ద ఎత్తున మంటల్ని రగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో మండుతున్న ఎండలు.. త్వరలో మన దగ్గర మొదలు కానున్న వేసవి మరెంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.